● ‘నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరించాలి’ | - | Sakshi
Sakshi News home page

● ‘నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరించాలి’

Feb 27 2026 4:27 AM | Updated on Feb 27 2026 4:27 AM

● ‘నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరించాలి’

● ‘నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరించాలి’

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా ప్రబలడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి శ్రీకాకుళం నగరం చేరుకున్న రామ్మోహన్‌ నాయుడు నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సాయంత్రం జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించారు. మున్సిపల్‌ శాఖ నుంచి విడుదల కాబోతున్న నిధులు, సుడా నుంచి మంజూరైన రెండు కోట్లతో డ్రెయిన్లు, పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. నీటి పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించాలన్నారు. దీనికోసం సమగ్ర రిపోర్టును సిద్ధం చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement