మరొకరు మృతి..? | - | Sakshi
Sakshi News home page

మరొకరు మృతి..?

Feb 27 2026 4:27 AM | Updated on Feb 27 2026 4:27 AM

మరొకరు మృతి..?

మరొకరు మృతి..?

● డయేరియాతో

అతిసారం అరికట్టేందుకు చర్యలు

శ్రీకాకుళం: నగరంలో డయేరియా మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారికంగా మాత్రం ఒకరే డయేరియాతో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. తాజాగా మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరొకరు మృతి చెందారు. కోటేశ్వరరావు అనే 61 ఏళ్ల వ్యక్తి ఆదివారం సాయంత్రం నుంచి మెడికవర్‌లో చికి త్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆస్పత్రి వర్గాలు మాత్రం కోటేశ్వరరావు డయేరియాతో చనిపోలేదని చెబుతుండ డం గమనార్హం. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధి తో తమ వద్దకు వచ్చాడని కిడ్నీకి మాత్రమే తాము వైద్యం చేస్తుండగా గురువారం గుండెపోటు వచ్చి చనిపోయాడని చెబుతున్నారు. సంబంధిత రోగి రిమ్స్‌ నుంచి రిఫరై వచ్చినప్పటికీ.. రోగి బంధువులు తమ వద్దకు తీసుకురావడంతో చేర్చుకున్నామని చెబుతున్నారు. రిమ్స్‌లో డయే రియాతో చేరి చికిత్స పొందినట్లు తమకు రోగి బంధువులు ఎవరూ చెప్పలేదని, తమ ఆస్పత్రికి వచ్చేసరికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు.

శ్రీకాకుళం: నగర పాలక సంస్థ పరిధిలో అతిసార వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి కమిషనర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ము ఖ్యంగా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న దమ్మ ల వీధి, కాకి వీధి, మంగువారి తోట, మేదర వీధి, గుడి వీధి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఫాస్ట్‌ ఫుడ్‌, మాంసం దుకాణాల వంటి ఆహార వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించా రు. ఈ నిబంధనలను అతిక్రమించి వ్యాపారా లు కొనసాగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పశువుల యజమానులు తమ ఆవులను, ఇతర మూగజీవాలను రోడ్లపైకి వదలకుండా ఇళ్లలోనే ఉంచాలని స్పష్టం చేశారు. ఈ ఆంక్షల ను ధిక్కరించే పశువుల యజమానులపై చట్టప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. జనం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను, వాటర్‌ ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలని అభ్యర్థించారు. విరేచనాలు, వాంతులు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని లేదా కార్పొరేషన్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 08942–228090 కు కాల్‌ చేయాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement