నిర్లక్ష్యం ముంచెత్తగా.. | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం ముంచెత్తగా..

Feb 27 2026 4:27 AM | Updated on Feb 27 2026 4:27 AM

నిర్ల

నిర్లక్ష్యం ముంచెత్తగా..

ఆదర్శ పాఠశాలల్లో..ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. –8లో ‘వెట్టి చాకిరీ నిర్మూలించాలి’

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
ఆదర్శ పాఠశాలల్లో..ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. –8లో

మురుగుతో మగ్గిపోతున్న జిల్లా కేంద్రం

దృష్టంతా ఒక ప్రాంతం పైనే..

పెరుగుతున్న డయేరియా కేసులు

రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణాల్ని పర్యవేక్షించని ఇంజినీర్లు

పంపు హౌస్‌, ఇన్‌ఫిల్టర్ల వద్ద అధ్వాన పరిస్థితులు

శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

కారణం తేలలేదట..

బాధ్యుడు మాత్రం కమిషనరే!

అధికారుల వింత వాదన

శ్రీకాకుళం: నగరంలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం నిర్ధారణ కాలేదని అధికారులు, మంత్రులు, శాసన సభ్యులు ప్రకటిస్తూనే బాధ్యుడు మాత్రం కమిషనరే అని భా వించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని తొలుత కార్పొరేషన్‌లోని ఆరోగ్య విభాగానికి సమాచారం వచ్చినప్పటికీ.. వారు సరిగా స్పందించలేదు. ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డయేరియాతో పాటు ఎలాంటి వ్యాధి ప్రబలినా సంబంధిత వార్డు సచివాలయాల ఆరోగ్య సిబ్బంది ద్వారా కార్పొరేషన్‌లోని ఆరోగ్యాధికారికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులకు సమాచారం అందుతుంది. వీరు సరిగా స్పందించకపోవడం వల్లనే వ్యాధి ఉద్ధృతమైందని వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో జనం విమర్శిస్తున్నారు. వాస్తవానికి సస్పెండ్‌ అయిన కమిషనర్‌ కూర్మారావు గతంలో జిల్లాలో డ్వామా పీడీగా పనిచేసే జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఈయన రాష్ట్రస్థాయిలో మంచి స్థాయిలో ఉండగా ఈయనను ఒప్పించి ఇక్కడకు తీసుకువచ్చి చేయని తప్పునకు సస్పెండ్‌ చేయడాన్ని నగరవాసులు తప్పు పడుతున్నారు. ఇప్పటికే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా అంతర్లీనంగా ఉద్య మం ప్రారంభమైంది. వీటిని ముఖ్యమంత్రికి పంపించాలన్న ఆలోచనలో కూడా పలువురు ఉన్నారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా రూపు మాపే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా పిలుపునిచ్చారు. ఆయన గురువారం శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్ట చేసి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంచార వాహనాన్ని ప్రారంభించారు. అంతకుముందు వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన పోస్టర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి ఆవిష్కరించారు. రుణం తీసుకున్నందుకు ప్రతిఫలంగా తక్కువ వేత నం లేదా వేతనం లేకుండా బలవంతంగా పనిచేయించడం నేరమన్నారు. చట్టం ప్రకారం వెట్టిచాకిరీ కింద ఉన్న పాత అప్పులన్నీ రద్దు అవుతాయని వివరించారు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది గేదల ఇందిరా ప్రసాద్‌, ‘నేచర్‌’ డైరెక్టర్‌ ఎస్‌.వికాస్‌, సిబ్బంది చైతన్య, దుర్గ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు .

గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు 1న పరీక్షలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా పరిధిలో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాలలో 2026–2027 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌ (జనరల్‌ –ఐఐటి, నీట్‌) ప్రవేశ పరీక్షలు మార్చి 1న జరగనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ వై.యశోదలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 1 ఉదయం 9.30 నుంచి 11 గంటలు వరకు ఉంటుందని, ఇంటర్మీడియట్‌ (జనరల్‌) మధ్యాహ్నం 12 గంటల 1.30 వరకు, ఐఐటి/నీట్‌ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్‌ (జనరల్‌), ఐఐటీ, నీట్‌ పరీక్షల కు పరీక్షా కేంద్రాలు ఒకటే ఉంటాయని తెలిపారు. జిల్లాలో గల 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, తల్లిదండ్రులు గమనించాలని కో రారు. వివరాలకు 9701736862, 83310 05217 నంబర్లను సంప్రదించాలని కోరారు.

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ వైఖరే డయేరియా ప్రబలడానికి కారణమైందని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డయేరియాతో నలుగురు మృతి చెందిన ప్రాంతమైన దమ్మలవీధిలోనే పారిశుద్ధ్య కార్మికులంతా పనిచేస్తున్నారే తప్ప నగరమంతటినీ పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం మున్సిపల్‌ కా ర్పొరేషన్‌లో సిబ్బంది సరిపడకపోతే జిల్లాలో ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి శుభ్రం చేసేందుకు అవకాశం ఉంది. అయినప్పటికి అలాంటి ప్రయ త్నం ఏమీ చేయడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యత ఉండేది. చెత్త సేకరణ అనేది ఓ డ్రైవ్‌లా నిరంతరం జరిగేది. కూటమి ప్రభుత్వంలో మాత్రం అవేమీ కానరావడం లేదు. అప్పుడప్పుడు పచ్చదనం–పరిశుభ్రత, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పేరుతో నేరుగా అధికారుల చేత చెత్తను సేకరించేలా ఫొటోలకు ఫోజులివ్వడం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం తర్వాత వదిలేయడం పరిపాటిలా మారింది. చెత్తను రోడ్లపై వేయకుండా, డస్ట్‌బిన్‌లలో చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు చెత్త సేకరణ వాహనాలను నిరంతరం ఇంటింటికి తిప్పడం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా వదిలేయడం వల్ల వచ్చిన పర్యవసానమే శ్రీకాకుళం నగరంలో డయేరియా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ మూడు రకాల డస్ట్‌ బిన్‌లు ఇచ్చి, క్లీన్‌ వెహికల్స్‌, క్లాప్‌ వెహికల్స్‌ పెట్టి ప్రతి రోజూ చెత్త సేకరిస్తే అంతా హేళన చేశారు. అదే సమయంలో కరోనా వస్తే శానిటేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా చేయడం వల్లే ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు పూడుకుపోయిన కాలువలు, పేరుకుపోతున్న చెత్త వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి.

ఒకేచోట కేంద్రీకృతం

దమ్మలవీధిలో డయేరియా ప్రబలడంతో మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పలుమార్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వస్తుండడంతో పారిశుద్ధ్య కార్మికులంతా ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతమైపోయారు. అక్కడ తీసిన కాలువలే తీసి, తీసిన చెత్తనే తీసి, వేసిన చోటే బ్లీచింగ్‌ మళ్లీ మళ్లీ వేసి శుభ్రం చేస్తున్నారు. నగరంలో బలగ, వాంబేకాలనీ, కాకివీధి, దండివీధులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో శానిటేషన్‌ పూర్తిగా గాలికొదిలేశారు. కుళాయి పైపు లైన్ల లీకులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో డయేరియా అనేది మెల్లగా మి గిలిన ప్రాంతాలకు పాకుతోందని నగరంలో చర్చ జరుగుతోంది. దమ్మలవీధి ప్రాంతానికే ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తూ మిగిలిన ప్రాంతాల్లో కుళాయిలు నచ్చిన సమయానికి నచ్చినట్లు ఇస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని నగర వాసులంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికై నా అన్ని ప్రాంతాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇళ్లలో ఉండలేకపోతున్నాం..

కాలువల్లో తీసిన చెత్తను, బురదను రోడ్డుపై వేసి వదిలేయడంతో మళ్లీ అవి కాలువల్లో పడుతున్నాయి. అంతేకాకుండా లోపల ఉన్నదాన్ని తీసి రోడ్డుపై వేసేయడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పల చుట్టూ పందులు, కుక్కలు మూగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్తను తీసుకెళ్తే మా ఆరోగ్యాలు బాగుంటాయి.

– ఎం.అప్పలనర్సమ్మ, బలగ, శ్రీకాకుళం నగరం

నిర్లక్ష్యం ముంచెత్తగా.. 1
1/3

నిర్లక్ష్యం ముంచెత్తగా..

నిర్లక్ష్యం ముంచెత్తగా.. 2
2/3

నిర్లక్ష్యం ముంచెత్తగా..

నిర్లక్ష్యం ముంచెత్తగా.. 3
3/3

నిర్లక్ష్యం ముంచెత్తగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement