ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ శాఖ, మేరా యువభారత్ సంయుక్తంగా గురువారం వర్సిటీలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాస్వామ్యం అనే అంశంపై విద్యార్థులు ప్రసంగించారు. జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషుల) ప్రిన్సిపాల్ యాళ్ల పోలినాయుడు, యూనిర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ, తెలుగుశాఖ అధ్యాపకుడు కె.ఉదయ్‌కిరణ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వర్సిటీతో పాటు శ్రీకాకుళం పట్టణానికి చెందిన డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయిలో జరిగే యూత్ పార్లమెంట్‌కు పంపిస్తామని ఎన్‌ఎస్‌ఎస్ పోగ్రామ్ కో–ఆర్డినేటర్ డి.వనజ తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, కె.స్వప్నవాహిని, ఈసీ సభ్యురాలు పి.సుజాత, సెట్‌శ్రీ సీఈఓ వి.వి.అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పశువులు పట్టివేత
రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి రణస్థలం వైపు వెళుతున్న పికప్ వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఏడు పశువులను లావేరు మండలం రావివలస హైవేపై పోలీసులు బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


