స్వప్నం.. సాకారం | - | Sakshi
Sakshi News home page

స్వప్నం.. సాకారం

Feb 28 2026 7:07 AM | Updated on Feb 28 2026 7:07 AM

స్వప్నం.. సాకారం

స్వప్నం.. సాకారం

తొలి ప్రయత్నంలో 3 బ్యాంకుల్లో ఉద్యోగాలు

గార: పట్టుదలే పెట్టుబడిగా.. క్రమశిక్షణే ఆయుధంగా ఓ సాధారణ ఇల్లాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదంటూ రుజువు చేశారు. మండలంలోని జొన్నలపాడుకి చెందిన ఎం.స్వప్న సాధారణ కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు చదువుకున్నారు. పెళ్లయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా ఇటీవల విడుదలపై ఐపీబీఎస్‌ పీవో (బ్యాంకు ఆఫ్‌ బరోడా), ఆర్‌ఆర్‌బీ పీవో (తెలంగాణ గ్రామీణ బ్యాంకు), శుక్రవారం విడుదలైన స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో జూనియర్‌ అసోసియేట్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్వప్న భర్త సాక్షి దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తుండగా, అత్త, మామలది చేనేత కుటుంబం. ఆమె స్వస్థలం విశాఖపట్నం.

స్వప్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement