కూటమి కుట్రలను తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

కూటమి కుట్రలను తిప్పికొట్టాలి

Mar 8 2026 7:38 AM | Updated on Mar 8 2026 7:38 AM

మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజకు నయవంచనకు గురిచేస్తోందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ప్రివిలేజ్‌ కమిటీ సభ్యురాలు రెడ్డిశాంతి అన్నారు. శనివారం ముక్తాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో ఎంతో ఆత్మ గౌరవంతో బతికిన ఆశావర్కర్లను కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నట్టేట ముంచారని అన్నారు. రూ.3000 వేతనాలతో బతుకులీడుస్తున్న సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారిని ఆదుకుని రూ.10వేలకు జీతాల్ని పెంచారని గుర్తు చేశారు. నేడు కూటమి నాయకులు ఆశా కార్యకర్తలపై రాజకీయ వేధింపులకు పాల్పడటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ముక్తాపురం సర్పంచ్‌ అలికాన జయప్రద, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉర్లాన బాలరాజు, నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షుడు అలికాన మాధవరావు, సీనియర్‌ నాయకుడు బమ్మిడి ఖగేశ్వరరావు, ఎంపీటీసీ రవికుమార్‌, జిల్లా కార్యదర్శి సవర సుభాష్‌, పల్లి యోగి, దువ్వాడ బారాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement