● ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని కాకివీధికి చెందిన జంగేటి ఆదిలక్ష్మి(85) మరణించారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానం కోసం రెడ్‌క్రాస్ చైర్మన్‌ను సంప్రదించారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ప్రస్తుత కాలంలో నేత్రదానంపై అవగాహన, చైతన్యం ప్రజల్లో పెరుగుతుందని, ఈ విధంగా నేత్రదానం ద్వారా మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని చైర్మన్ జగన్మోహన్‌రావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్‌లు అన్నారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


