ఇక నివేదన సక్రమంగా..
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు
అరసవల్లి: ‘సాక్షి’ కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. స్వామికి ప్రసాదాల నివేదన సక్రమమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుమారు రెండున్నరేళ్ల నుంచి బ్రాహ్మణ వంట పంతుల నియామకాన్ని చేపట్టకుండా ప్రసాదాల నివేదన లేకుండానే జరుగుతున్న అపచారానికి ఎట్టకేలకు చెక్ పడింది. లడ్డూ, పులిహోరలను తయారు చేసి ఆదిత్యుని మూలవిరాట్టుకు తొలిగా నివేదించకుండానే... ప్రసాదాల పేరిట విక్రయిస్తూ భక్తుల మ నోభావాలతో ఆటలాడుకున్న వైనాన్ని ‘ప్రసాదమా...అపచారమా...’ పేరిట ‘సాక్షి’లో గత నెల 26న గురువారం కథనం ప్రచురితమైంది. దీనిపై హింధూ ధర్మ పరిరక్షణ సమితి, అర్చక, పురోహిత సంఘాల ప్రతినిధులు తీవ్రంగా స్పందించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఈ కథనం క్లిప్పింగ్స్‌ను వాట్పాప్ ద్వారా పంపించారు. దీంతో ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆలయంలో బ్రాహ్మణ వంట పంతులు తాతావారి సోమేశ్వర శర్మను నియమించా రు. ఈ మేరకు ఆయన ఆలయ నిబంధనల మేరకు ఆచారాలకు తగ్గట్టుగా ఆదివారం ఉదయం నుంచి వండిన పులిహోర, లడ్డూలను ఉదయం 6 గంటలకే గర్భాలయంలోని ఆదిత్యునికి నివేదించి, అనంతరం ప్రసాదాలుగా భక్తులకు విక్రయాలు ప్రారంభించారు. అలాగే భక్తులకు దర్శనానంతరం ఇస్తున్న నిత్యాన్నప్రసాదాలను కూడా ఆయనే స్వయంగా తయారు చేసి వాటిని కూడా స్వామికి నివేదించారు.
ఇక నివేదన సక్రమంగా..


