మందుగుండు సామగ్రి స్వాధీనం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధి సింగుపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన గల ఓ భవనంలో క్వారీ రాళ్లకు వాడే మందుగుండు సామగ్రిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్‌ఐ రాము, సిబ్బందితో కలిసి మాకుమ్మడిగా దాడులు చేసి వంజరాపు రామారావు అనే వ్యక్తి ఇంటిలో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సామగ్రిని క్వారీ రాళ్లు పేల్చేందుకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వివరించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిలో లిక్విడ్ స్టిక్స్ 5 బాక్సులు, ఆర్డినరీ డిటో నేటర్స్ 15 బాక్సులు, ఫ్యూజ్‌వైర్ 5 కట్టలు, కొండ ఒత్తులు 50 మీటర్లు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు. ఈ సామగ్రిని లైసెన్స్‌డ్ షాపులకు తరలిస్తున్నట్లు తెలిపారు.


