సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

సైబర్

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలలో స్కిల్‌ హబ్‌ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కౌసిక్‌ వికాస్‌ యోజన 4.0 ద్వారా సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కె.చక్రపతి ఆదివారం తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ కోర్సు మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 7వ తేదీలోగా సర్టిఫికెట్‌తో పాటు ఆధార్‌ కార్డు, ధ్రువీకరణ పత్రాలతో పాతపట్నం డిగ్రీ కళాశాలలో ఉన్న స్కిల్‌ హబ్‌ సెంటర్‌ను సంప్రదించాలని, 9553292734 నంబర్‌ను సంప్రదించాలని ఆయన కోరారు.

జిల్లా స్థాయి ఇంటర్‌ క్లబ్‌ స్కేటింగ్‌ పోటీలు

పలాస: పలాసలో జిల్లా స్థాయి ఇంటర్‌ క్లబ్‌ స్కేటింగ్‌ పోటీలు ఆదివారం జరిగాయి. ఈ పోటీలను మున్సిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ స్కేటింగ్‌ వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుందన్నారు. ఈ క్రీడాకారులు జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో స్కేటింగ్‌ క్లబ్‌ నిర్వాహకులు టి.వి ప్రవీణ్‌, షన్మఖ,కోచ్‌లు పాల్గొన్నారు.

రేపు ఆలయాల మూసివేత

అరసవల్లి: కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయా న్ని ఈ నెల 3న మూసివేస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సంయుక్తంగా ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిత్యుని ఆలయంలో మంగళవారం ఉద యం నిత్యార్చన, బాలభోగం అనంతరం ఉద యం 9.30 గంటల నుంచి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లుగా వివరించారు. గ్రహణానంతరం సంప్రోక్షణ, శుద్ధి తదితర ప్రక్రి యల అనంతరం అంటే బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి తిరిగి సర్వదర్శనాలు మొదలవుతాయని వారు తెలియజేశారు. భక్తులు గ్రహణ నియమాలు పాటించి, విడుపు అనంతరం ఆదిత్యుడిని దర్శించుకోవాలని శంకరశర్మ సూచించారు.

3న శ్రీకూర్మనాథాలయం మూసివేత

గార: మూడో తేదీన పౌర్ణమిలో చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఉదయం 11 గంటల నుంచి మూసివేస్తున్నామని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు అన్నారు. మంగళవారం ఉదయం దర్శనాలు అనంతరం మూసివేసి సాయంత్రం 7. 30 గంటల నుంచి సంప్రోక్షణ జరుగుతుందన్నారు. రెండు గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉంటాయని తెలిపారు. శ్రీముఖలింగంలోనూ ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు.

ప్రశాంతంగా ప్రవేశ పరీక్షలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్వంలో 5, ఇంటర్మీడియెట్‌ తరగతుల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2026–2027 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం జిల్లా నందు గల 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షకు (09 పరీక్షా కేంద్రాలు) 887 మంది దరఖాస్తు చేసుకోగా 756 మంది హాజర య్యారు. 131 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్‌ ప్రవేశ పరీక్షకు జనరల్‌ కి (09 పరీక్షా కేంద్రాలు) 1201 మంది దరఖాస్తు చేసుకోగా 1093 మంది హాజరుకాగా, 108 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్‌ (ఐఐటీ, నీట్‌) ప్రవేశ పరీక్షకు (09 పరీక్షా కేంద్రాలు) 768 మంది దరఖాస్తు చేసుకోగా 689 మంది హాజ రు కాగా, 79 మంది గైర్హాజరయ్యారు. జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు.

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం 1
1/2

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం 2
2/2

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement