కబ్జా కోరల్లో పగడాల చెరువు
వజ్రపుకొత్తూరు మండలం కొండ వూరు బౌండరీ పరిధిలోకి వచ్చే పగడాల చెరువు విస్తీర్ణం 29.86 ఎకరాలు ఉంటే అందులో 20ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. చెరువు, గుట్టలతో పాటు గర్భమంతా ఆక్రమించేశారు. దాదాపు 200 మంది రైతులకు చెందిన 150 ఎకరాల వరకు ఆయకట్టుగా ఉండే పగడాల చెరువును కళ్ల ముందే రోజురోజుకి కబ్జా చేసేస్తున్నారు. చెరువు సరిహద్దుకు ఆనుకుని జిరాయితీ పొ లాలు ఉండటంతో వాటి ముసుగులో గట్లపై మొక్కలు వేస్తూ అలా చెరువు గర్భంలో చొరబడి ఆక్రమించేశారు. చెరువుకు ఉత్తర, పడమర, దక్షిణ వైపు గట్లు ఏకంగా కనుమరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద గట్లు వేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆక్రమణదారులు అడ్డుకునేంతవరకు వెళ్లిపోయారు.


