పరిస్థితి దారుణం
మొక్కజొన్న రైతు పరిస్థితి దారుణం. కనీస మద్దతు ధర దక్కలేదు. గత ప్రభుత్వం అయితే రూ.2400 మద్దతు ధర ప్రకటించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కానీ టీడీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేయలేదు. అందుకే దళారులకు రూ.1700కు విక్రయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో బాగుండేది. ఇప్పుడే తీరని అన్యాయం జరుగుతోంది. మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
– కొవగాపు నవీన్, రైతు, తాయిమాంబాపురం
శ్రమకు తగిన ఫలితం లేదు..
తక్కువ రోజుల్లో పంట అందుబాటులోకి వస్తుందని భావించి మొక్కజొన్న వేసుకున్నాం. ఆరుగాలం కష్టపడి పంటను సాగుచేస్తే గిట్టుబా టు లేదు. మద్దతు ధర అయితే ప్రకటిస్తున్నారు. కానీ కొనుగోలు చేసిన వారు కరువవుతున్నారు. ఇప్పటికై నా మార్కెటింగ్, రవాణా కల్పించాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
– ఎల్.శ్రీనివాసరావు, రైతు, కిట్టాలపాడు
పరిస్థితి దారుణం


