నేడు ఆదిత్యలో గో కార్టింగ్‌ ఫైనల్‌ రేస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఆదిత్యలో గో కార్టింగ్‌ ఫైనల్‌ రేస్‌

Mar 7 2026 7:18 AM | Updated on Mar 7 2026 7:18 AM

టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గో కార్టింగ్‌ పోటీల్లో భాగంగా శనివారం ఫైనల్‌ రేస్‌ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం సెమీ ఫైనల్‌ రేసింగ్‌ పోటీలు నిర్వహించారు. సామర్థ్యపు పరీక్షల నిపుణులు దుర్గాప్రసాద్‌, ఎం.కిరణ్‌కుమార్‌, శివతేజ, పి.హిర్లఖర్‌, సాగర్‌ వ్యాస్‌, ఎం.శంకర్‌ సాయిరాం, ఎం.కులదీప్‌కుమార్‌, జి.వరుణ్‌రెడ్డి తదితర బృందం సెమీ ఫైనల్‌ పోటీలను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ఆయా వాహనాల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ ఏఎస్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ డి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

ఎత్తిపోతల పనుల పరిశీలన

హిరమండలం: వంశధార ఎత్తిపోతల పథకం నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఆయన శుక్రవారం వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌తో పాటు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అక్కడి అధికారులతో పా టు కాంట్రాక్టర్‌ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకొని ఎప్పటికప్పుడు వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌, ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల గురించి సమీక్షిస్తున్నట్టు తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ట్యాంకుల అమరిక, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులు పూర్తిచేస్తామని చెప్పారు. సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి నగదును ట్రాన్స్‌కోకు చెల్లించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ 55 శాతం పనులు పూర్తయ్యా యన్నారు. మిగతా పనులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని చెప్పారు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హిరమండలం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్టు కలెక్టర్‌ తెలిపారు.

వాయుసేనలో కొలువులకు ‘అగ్నివీర్‌’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిరుద్యోగ యువతకు ఒక సువర్ణావకాశమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9, 12వ తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. అభ్యర్థులు ముందస్తుగా ఎలాంటి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన వారు నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చని ఆయన పేర్కొన్నారు. 9న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రా ష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు, మార్చి 12న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పురుష అభ్యర్థులకు ఎంపికలు నిర్వహిస్తారు. అభ్య ర్థులు 02.07. 2005 నుంచి 02.01.2009 మధ్య జన్మించి ఉండాలని, కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని కలెక్టర్‌ వివరించారు. విద్యార్హతల విషయానికి వస్తే.. ఇంటర్మీడియె ట్‌ లేదా డిప్లొమా లేదా ఒకేషనల్‌ కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులు, అలాగే ఇంగ్లిష్‌ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 49.99 శాతం మార్కులు ఉన్నా కూడా అనర్హులుగా పరిగణిస్తారని ఆయన గుర్తు చేశారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులు తమ వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్‌తో పాటు, ఆధార్‌ కార్డు, డొమిసైల్‌ సర్టి ఫికెట్‌, ఎన్‌సీపీ (ఉంటే), 10 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, ప్రతి సర్టిఫికెట్‌కు 6 సెట్ల జిరాక్స్‌ కాపీలను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement