● ఎనిమిది నియోజకవర్గాలకు పేర్లు ఖరారు
● సీనియారిటీ, విధేయత, సమర్థత, పనితీరుకు పెద్దపీట
● పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు జారీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాలకు పరిశీలకుల్ని నియమిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధేయత, సీనియారిటీ, సమర్థత, పనితీరు ఆధారంగా నియామకాలు చేపట్టారు. అసెంబ్లీ పరిశీలకులగా నియమితులైన వారంతా పార్టీ రాష్ట్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ రీజినల్ కో ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అసెంబ్లీ నియోజక వర్గాల నియమితులైన వారి వివరాలివి..
ఇచ్ఛాపురం: దుంపల లక్ష్మణరావు
ఆమదాలవలస : కరిమి రాజేశ్వరరావు
పాతపట్నం : పాలవలస విక్రాంత్
ఎచ్చెర్ల: పెనుమత్స సూర్య నారాయణ రాజు
నరసన్నపేట: అంధవరపు సూరిబాబు
టెక్కలి: చల్లా రవికుమార్
పలాస : ఎన్ని ధనుంజయ్
శ్రీకాకుళం: పిన్నింటి సాయి సురేష్ కుమార్


