వృద్ధ దంపతులపై దాడి | - | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతులపై దాడి

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

వృద్ధ

వృద్ధ దంపతులపై దాడి

నందిగాం: మండలంలోని దిమ్మడిజోలకు చెందిన వృద్ధ దంపతులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సలాన మన్మథరావు, రూపావతి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ హైదరాబాద్‌లో ఉంటుండగా వీరు గ్రామంలోనే నివసిస్తున్నారు.

అయితే వారి ఇంటి పక్కనే ఉన్న గొర్లె వాసుదేవరావుతో వీరికి చిన్న పాటి గొడవలు ఉండడంతో శనివారం మాటామాటా పెరిగింది. దీంతో వాసుదేవరావు మన్మథరావు తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. రక్తం గమనించిన మన్మథరావు భార్య రూపావతి ఎందుకు కొట్టావని వాసుదేవరావును ప్రశ్నించడంతో ఆమె తలపై కూడా కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యంది. అనంతరం గాయాలు పాలైన వృద్ధ దంపతులను గ్రామస్తులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కాగా వాసుదేవరావు ఇద్దరినీ తీవ్రంగా కొట్టడానికి గల కారణాలు తెలియలేదు. నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధ దంపతులపై దాడి 1
1/1

వృద్ధ దంపతులపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement