చందాలు వేసుకుని రోడ్డు పనులు
ఎచ్చెర్ల : తోటపాలేం పంచాయతీ డోలవానిపేటలో గ్రామస్తులు చందాలు వేసుకుని రోడ్డు బాగుచేసుకుంటున్నారు. ఇక్కడ జాతీయ రహదారి నుంచి డోలవానిపేటకు సుమారు కిలోమీటరు మేర రహదారి ఉంది. పొలాల మధ్యలో రోడ్డు ఉండటంతో రహదారి కాస్త పొలం గట్టుగా మారింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు మొదలయ్యాయి. గతంలో రోడ్డు పనులను ప్రారంభించి నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఇంటికి వెయ్యి రూపాయులు చొప్పున చందాలు వేసి ప్రొక్లెయిన్‌తో రోడ్డు చదును పనులు చేపడుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలని వారంతా కోరుతున్నారు.


