రక్తసంబంధీకులు..!
● సామాజిక దృక్పథం చాటుకుంటున్న విద్యార్థులు
● ఉపాధ్యాయుల స్ఫూర్తితో రెడ్‌క్రాస్
సభ్యులుగా సేవలు
● 8 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహణ
శ్రీకాకుళం కల్చరల్: విద్యతో పొందిన జ్ఞానం సమాజానికి ఉపయోగపడితేనే అది నిజమైన విద్య అన్నటువంటి సూక్తిని నగరంలోని పీఎన్ కాలనీలో ఉన్నటువంటి న్యూ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయులు చాటి చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా విద్యార్థులకు సామాజిక దృక్పథం అలవర్చుచుకునేలా బోధన చేస్తున్నారు. వారిచ్చిన స్ఫూర్తితో 473 మంది విద్యార్థులు జూనియర్ రెడ్‌క్రాస్ సభ్యులుగా సేవలందిస్తున్నారు. వీరంతా ప్రతీ ఏడాది తమ తల్లిదండ్రులను, తమకు తెలిసిన వారిని మోటివేట్ చేస్తూ మరింతగా ముందుకెళ్తున్నారు.
పాఠశాల వార్షికోత్సవంలో...
పాఠశాల విద్యార్థుల్లో సామాజిక బాధ్యత నేర్పే క్రమంలో ప్రతి ఏడాది మార్చి మొదటి వారంలో జరిగే పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా రక్తదానంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, భారీస్థాయిలో రక్తపు యూనిట్లు సేకరించి రెడ్‌క్రాస్ సంస్థకు అందజేస్తారు. రక్తదాన శిబిరాలు ప్రారంభించిన సంవత్సరం నుంచి 95 యూనిట్లు సేకరిస్తే.. గత సంవత్సరం 258 యూనిట్లు రక్తాన్ని సేకరించడం జరిగింది. అంటే ఈ మహా యజ్ఞంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతున్న పరిణామం ఆదర్శనీయం. ఈ ఏడాది కూడా మార్చి 1వ తేదీన స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు.
23 యూనిట్స్ అందించాం
స్కూల్లో చదువుతున్న మేము మా ఉపాధ్యాయుల సూచ నల మేరకు ఇప్పటివరకు 23 యూనిట్స్ మా ద్వారా ఇచ్చాం. ఎంతో ఆనందంగా ఉంది. మేము రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా ఉన్నాం. – పి.జూహిత్‌రాజ్, జెస్వీ
మా ద్వారా 12 యూనిట్లు
ఇప్పటివరకు మా ద్వారా 12 యునిట్లు సేకరించాం. రెడ్‌క్రాస్ సభ్యులుగా మా తల్లిదండ్రులు, మా చుట్టాలకు రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాం. వారితో రక్తదానం చేయిస్తున్నాం.
– బి.కార్తికేయ, రేణు రెహన్షి
మేమూ సమాజ సేవలో
మా చిన్నతనం నుంచి సేవాభావాన్ని మాలో నింపిన యాజమాన్యానికి ధన్యవాదాలు. మేము కూడా జూనియర్ రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకొని ఇప్పటివరకు 8 యూనిట్ల రక్తం సేకరించాము. దీనికి మాకు సంతోషంగా ఉంది. – జె.జస్వంత్, జె.ప్రభాస్
1న రక్తదాన శిబిరం
ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. గతేడాది చాలా మంది వచ్చి రక్తదానంలో పాల్గొన్నారు. మా విద్యార్థులకు సామాజిక దృక్పథం అవసరమని సూచిస్తున్నాం. దాని ఫలితంగా గతేడాది ఎక్కువ రక్తం యూనిట్లు సేకరణ చేశాం. ఈ ఏడాది కూడా మరలా మార్చి 1వ తేదీన పాఠశాలలో రక్తదాన శిబిరం నిర్వహిస్తాం.
– పి.శ్రీకాంత్, న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్
రక్తసంబంధీకులు..!
రక్తసంబంధీకులు..!
రక్తసంబంధీకులు..!
రక్తసంబంధీకులు..!
రక్తసంబంధీకులు..!


