అలిగితివా అమాత్యా! | - | Sakshi
Sakshi News home page

అలిగితివా అమాత్యా!

Mar 4 2026 7:31 AM | Updated on Mar 4 2026 7:31 AM

● గ్రహణ కాలం

మంత్రి అచ్చెన్నాయుడికి తెలియకుండానే జిల్లాలో వివిధ పరిణామాలు

కమిషనర్‌ సస్పెన్షన్‌ వెనక కారణమేదైనా అచ్చెన్నకు అపవాదు

బాధితులకు పరిహారం పంపిణీలో కనబడని ప్రాధాన్యం

అంతా తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

రాజకీయ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన అచ్చెన్న వ్యవహారం

కేతుగ్రస్త చంద్ర గ్రహణం జిల్లాలో సుస్పష్టంగా కనిపించింది. మంగళవారం సాయంత్రం దాదాపు 6.26కు మొదలైన ఈ ఖగోళ విన్యాసం దాదాపు 6.55 వరకు కొనసాగింది. నిండు చంద్రుడు చీకటిలో కలిసిపోవడం.. అంతలోనే మళ్లీ ఉదయ భానుడిలా ఎర్రగా మెరిసిపోవడాన్ని చాలామంది ఆసక్తిగా తిలకించారు. మరికొందరు ఈ సమయంలో ఇళ్లకే పరిమితమయ్యారు . – సాక్షి ఫొటోగ్రాఫర్‌, శ్రీకాకుళం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అలిగారా? ఎమ్మెల్యే గొండు శంకర్‌తో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయా? అచ్చెన్నకు తెలియకుండానే గొండు శంకర్‌ వ్యవహారాలు నడుపుతున్నారా? మంత్రికి తెలియకుండానే జిల్లా కేంద్రంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయా? తాను అనుకున్నట్టుగా జరగకపోవడం వల్లే అచ్చెన్న జిల్లా కేంద్రంలో అడుగు పెట్టడం లేదా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సందేహాలు కలుగుతున్నాయి.

ఎందుకీ మౌనం

శ్రీకాకుళం నగరాన్ని డయేరియా పట్టి పీడిస్తోంది. ఆరుకి పైగా మరణాలు సంభవించాయి. ప్రభుత్వం తీవ్ర అప్రతిష్టపాలైంది. మున్సిపల్‌ మంత్రి నుంచి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వరకు కాస్త ఆలస్యంగానైనా నగరంలో పర్యటించారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టరైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం నగరంలో అడుగు పెట్టలేదు. జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కేంద్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు పర్యటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధితులను పరామర్శించేందుకు కనీసం ప్రయత్నించలేదు. నగర ప్రజలకు అచ్చెన్నాయుడు తన ముఖమే చూపించలేదు. వ్యాధి ప్రబలిన తొలి రోజుల్లో ఫోన్‌ల ద్వారానైనా అధికారులతో సమీక్షలు చేసి, అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది కూడా చేయలేదు.

కారణమేంటో?

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో విభేదాల కారణంగానే అచ్చెన్న మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరితో ఏమున్నా కష్ట కాలంలో ఉన్న నగర ప్రజలపై కక్ష కట్టినట్టు.. నిర్లక్ష్యంగా ఉండటంపై ఇప్పుడనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సామాజిక వర్గాల మధ్య పోరులో తాను ఎటూ వెళ్లినా టార్గెట్‌ అయిపోతున్నారన్న వాదనైతే గట్టిగానే ఉంది. కాళింగ సామాజిక వర్గీయులను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. రాజకీయంగా పదవులు సాధించేందుకు అర్హత గల నేతలకు అందలం దక్కకుండా అచ్చెన్నాయుడు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో, నగరంలో ఏం జరిగినా అచ్చెన్నాయుడే బాధ్యుడైపోతున్నారు.

రుచించని ఎమ్మెల్యే తీరు..

స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ అంతా తానై వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్‌లో ప్రతి వ్యవహారాన్ని తానే చూసుకుంటున్నారు. ప్రతీది తనకు తెలిసే జరగాలని, తాను చెప్పినట్టే చేయాలని, పరిపాలన అంతా తన ద్వారానే జరగాలని ఆశిస్తున్నారు. ఆదేశిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడల వలనే కార్పొరేషన్‌లో దయనీయ పరిస్థితి ఏర్పడిందని, యంత్రాంగం సమర్థంగా పనిచేయడం లేదన్న వాదనలు ఉన్నాయి. దీనికి తోడు కూర్మారావు కమిషనర్‌గా నియమితులవ్వడంపై ఎమ్మెల్యేకు తెలియకుండా జరిగిందని కొందరు.. తెలిసే జరిగిందని కొందరు భావిస్తున్నారు. అదే విధంగా సస్పెన్షన్‌ విషయంలో కూడా ఎమ్మెల్యేనే కారణమని కొందరు, ఎమ్మెల్యేనే చేయించి ఉంటే కూర్మారావు ఇంటికి వెళ్లి ఎందుకు ఓదార్చుతారని కొందరు, డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు.

అచ్చెన్నను పట్టించుకోవడం లేదా?

ఎమ్మెల్యే గొండు శంకర్‌ కూడా కొన్ని విషయాల్లో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డయేరియా బాధితులకు పరిహారం విషయంలో మంత్రులతో పనిలేకుండా నేరుగా ఎమ్మెల్యే పంపిణీ చేయడం కూడా అచ్చెన్నను బాధ పెట్టినట్టు వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ అచ్చెన్నకు ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. కష్టకాలంలో సొంత జిల్లా కేంద్ర ప్రజల్ని అచ్చెన్న పట్టించుకోకపోవడం, పరామర్శించకపోవడం, అండగా నిలిచేలా నగరంలో పర్యటించకపోవడం మాత్రం విమర్శలకు దారితీస్తోంది.

అరసవల్లి దేవాలయం ప్రధాన ద్వారం మూసి వేత

శ్రీకాకుళం కల్చరల్‌: కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9:30 గంటలకు అరసవల్లి దేవాలయ తలుపులు మూసివేశారు. బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిస్తారు.

జలుమూరు: శ్రీముఖలింగం ఆలయాన్ని రాత్రి ఏడు తర్వాత ఆలయం శుద్ధి, సంప్రోక్షణ చేసి యథావిధిగా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు.

కూర్మనాథాలయంలో సంప్రోక్షణ చేస్తున్న అర్చకులు

గార: చంద్రగ్రహణం కారణంగా శ్రీకూర్మనాథుని ఆలయాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు మూసివేసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు తెరిచారు. డోలోత్సవాలు సందర్బంగా కామదహనోత్సవం కారణంగా ఆలయాన్ని శుభ్రపరిచారు. అనంతరం రాత్రి కామదహనోత్సవం నిర్వహించారు.

అంగన్‌

వాడీ

అరెస్టుల

వేడి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):

అంగన్‌వాడీలపై ప్రభు త్వ నిర్బంధ కాండ అమానుషమని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు అన్నా రు. విజయవాడ ధర్నా చౌక్‌లో తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో వేకువజామున అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ వర్కర్స్‌–హెల్పర్స్‌ యూనియన్‌, సీఐటీయూ ఆధ్వ ర్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి డే–నైట్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్‌వాడీలు ఆందోళనలు నిర్వహించారు.

మహిళలు అని చూ డకుండా ఈడ్చి అరెస్టులు చేయడం సరికాదన్నారు. పోలీసుల దాడిలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి చెయ్యి విరిగిందని, కొంతమంది స్పృహ తప్పి పడిపోయారన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే మహిళా సాధికారత ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన నాయకులు ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు.

రెండు తలలతో జన్మించిన దూడ

పొలిటికల్‌

టాక్‌

కమిషనర్‌ సస్పెన్షన్‌తో

తాజాగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన హనుమంతు కూర్మారావు శ్రీకాకుళం నగర మున్సిపల్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇక్కడకు రావడానికి మంత్రి అచ్చెన్నాయుడు సహకారం ఉందని వాదనలు ఉన్నాయి. అలాగే ఇతరుల సిఫార్సుల మేరకు కూడా కూర్మారావు ఇక్కడికి వచ్చి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. కానీ డయేరియా కారణంతో బాధ్యతలు స్వీకరించిన 14 రోజుల్లోనే బాధ్యుడిని చేస్తూ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వాస్తవానికి, డయేరియా ప్రబలడానికి ఆయన కారణం కాదు. దానికి సంబంధించి అయితే మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ లేదంటే ఇంజినీర్లు బాధ్యులు కావాలి. వీరిని కాదని కమిషనర్‌గా కొత్తగా వచ్చిన కూర్మారావును బలి చేశారు. ఇది రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపింది. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కూర్మారావును బలి చేశారని, దీనికి అచ్చెన్నాయుడే కారణమని కాళింగ సామాజిక వర్గీయులు గుర్రుగా ఉన్నారు. దీంతో తాను అనవసరంగా విమర్శలకు గురయ్యాయని, విపరీతమైన చెడ్డ పేరు వచ్చిందని ఆయన అంతర్మధనం చెందుతున్నారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement