కుక్కల దాడిలో 17 గొర్రెలు మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో 17 గొర్రెలు మృతి

Mar 4 2026 7:16 AM | Updated on Mar 4 2026 7:16 AM

బూర్జ: మండలంలోని కొరగాం గ్రామానికి చెందిన పిన్నింటి వెంకన్న అలియాస్‌ వెంకటరమణకు చెందిన 17 గొర్రెలు, ఒక మేక కుక్కల దాడిలో మృతి చెందినట్లు గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్‌ సతీష్‌ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి గ్రామ సమీపంలో గొర్రెలు, మేకల మందను ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున మందపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. మృతి చెందిన జీవాలు విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని పశువైద్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత సభ్యులు కోరుతున్నారు.

బొరిగిపేటలో అనుమానితుల కలకలం

టెక్కలి రూరల్‌: బొరిగిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కొందరు అనుమానిత వ్యక్తులు సంచరించడంతో గ్రామస్తులు వెంబడించారు. ఐదుగురిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వెంటనే విద్యుత్‌ స్తంభానికి కట్టేసి ప్రశ్నించారు. వివరాలు చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిర్వాసితుల హామీ నెరవేర్చేదెప్పుడు?

కొత్తూరు: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వంశధార నిర్వాసితుల సంఘం నాయకుడు, మెట్టూరు బిట్‌–2 సర్పంచ్‌ యర్లంకి ధర్మారావు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ చింతాడ సూర్యనారాయణ అన్నారు. మెట్టూరులో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో నిర్వాసితలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకుంటామని ప్రస్తుత సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కృషి మేరకు నిర్వాసితులకు అదనపు ప్యాకేజి కింద రూ. 217 కోట్లు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలతో అదనపు ప్యాకేజీలు అందుకోని 30 శాతం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందివ్వాలన్న ఆలోచన లేకపోవడం అన్యాయమన్నారు. సమావేశంలో సర్పంచ్‌ పెదకోట సాదుబాబు, మురపాక శంకరరావు, పార్టీ నాయకులు నిమ్మగడ్డ కృష్ణారావు, యర్లంకి ధర్మారావు, సవర రమేష్‌, మఠం పూర్ణ, దుర్యోధన, మణి, రమణ తదితరుఉల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement