● తిలారు రైల్వేస్టేషన్‌లో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్
● అప్రమత్తమైన అధికారులు
జలుమూరు: అందరికీ కళ్లలో భయం.. అందరి ఇళ్లలో భయం. తిలారు మంగళవారం భయంతో వణికింది. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని గుండె అరచేతిలో పెట్టుకుని గడిపింది. తిలారు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ గూడ్సు బండిలో ఉన్న ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై ంది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో ఊరి వారితో పాటు స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్‌లోని ప్రజలు కూడా తీవ్ర భయాందోళన చెందారు. అధికారులు వచ్చి లీకేజీ ని అరికట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నరసన్నపేట సీఐ తోపాటు పోలాకి, జలుమూరు, సారవకోట పోలీసు సిబ్బంది వచ్చి ప్రమాద నివా రణ చర్యలు తీసుకున్నారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, ఆర్డీఓ కె.సాయిప్రత్యూషలు అక్కడకు చేరుకుని గ్యాస్ లీకేజీని నిలుపుదల చేశారు. విశాఖ నుంచి రైల్వే, హెచ్‌పీసీఎల్ అధికారులు వచ్చి బండి నుంచి లీక్ అవుతున్న వ్యాగన్‌ను వేరుచేశారు.
రైలు నిలుపుదలతో ప్రయాణికుల ఇక్కట్లు
ఆమదాలవలస: తిలారు వద్ద గ్యాస్ ట్యాంకర్ లీక్ అయిన ఘటన సందర్భంగా శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లో మంగళవారం సాయంత్రం వందేభారత్ ఎక్స్‌ప్రె్‌స్ రైలు నిలుపుదల చేశారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్‌కు సాయంత్రం 5.10 నిమిషాలకు రావా ల్సి ఉండగా కొద్దిసేపు ఆలస్యంగా సాయంత్రం 5.35 నిమిషాలకు వచ్చింది. రాత్రి 7.45 వరకు శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్‌లోనే ఉంచేశారు. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వీక్లీ ట్రైన్ రెండుగంటలు ఆలస్యంగా నడిచింది. ఈ రైలును కూడా కాసేపు ఆపేశారు.


