జీతాలు, పింఛన్లు అందక అలమటిస్తున్న గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లు
మూడు నెలలుగా చెల్లించని సర్కారు
బడ్జెట్‌లో అరకొర కేటాయింపులే కారణం
కనికరించండి.
త్వరలోనే పరిష్కరిస్తాం
గ్రంథాలయం..
శ్రీకాకుళం అర్బన్/టెక్కలి: విజ్ఞాన భాండాగారాలుగా భావించే గ్రంథాలయాలు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తుంటాయి. పోటీ పరీక్షల సన్నద్ధతకు తోడ్పాటునందిస్తుంటాయి. అటువంటి గ్రంథాలయాల నిర్వహణపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు సుమారు మూడు నెలలుగా జీతాలు, పింఛన్లు అందజేయడం లేదు. దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మండల, జిల్లా స్థాయిలో అధికారులకు, రాష్ట్ర స్థాయిలో ప్రజాప్రతినిధులకు గోడు విన్నవిస్తున్నా కనీస స్పందన కూడా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌లో
పూర్తిగ్రాంటు విడుదల చేయక..
2025–26 సంవత్సరానికి గాను బడ్జెట్‌లో సిబ్బంది జీత భత్యాలకు, పెన్షలకు రూ.130కోట్లు కావలసి ఉండగా కేవలం రూ.40 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇక జిల్లాకు వచ్చేసరికి ఈ ఏడాది గ్రాంట్ రూపంలో వచ్చిన నిధులు రూ.2.22 కోట్లు మాత్రమే. ఏప్రిల్ 2025 నుంచి నవంబరు 2025 వరకూ 8 నెలల వరకు అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపితే తిరుగు టపాలో పంపించేశారు. గ్రంథాలయపు పన్ను నుంచి లైబ్రరీ సెస్‌ను వినియోగించుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 డిసెంబరు నుంచి 2026 ఫిబ్రవరి వరకూ గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు నిలిచిపోయాయి. జిల్లాలో గ్రంథాలయ ఉద్యోగులకు, పెన్షనర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, పేపర్ బిల్లులకు నెలకు రూ.45లక్షలు అవసరం. జిల్లాలో 20 మంది శాశ్వత ఉద్యోగులు, 60 మంది పింఛనుదారులు, 13 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మొత్తంగా 90 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాదికి రూ.5కోట్ల మేర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల నుంచి గ్రంథాలయ పన్ను వసూలు కావలసి ఉంది. కాని రూ.2కోట్లు మాత్రమే వసూలైంది.
గోడు వినేవారేరీ..?
గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు నెలలుగా జీతాలు, పెన్షన్‌లు అందకపోవడంతో వారంతా దశల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసిశారు. అయినా ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారిలో తక్కువ వేతనాలు, పెన్షన్లు అందుకుంటున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇదిలా ఉండగా ఉద్యోగులు, పెన్షనర్లంతా సెస్ నిధులపై ఆధారపడాలనే సంకేతాలు పాలకులు నుంచి వస్తున్నాయనే ఆందోళన మొదలైంది.
ఘనంగా రట్టి వల్లభ నారాయణుని డోలోత్సవం
మందస: భేతాళపురం పంచాయతీ రట్టి గ్రామంలో వల్లభ నారాయణుని డోలోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రహణం కారణంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయం మూసివేశారు. ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడు నెలలుగా జీతాలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. జేసీ, మున్సిపల్ అధికారులను కలిశాం. శ్రీకాకుళం మున్సిపాలిటీ కట్టాల్సిన సెస్‌ను త్వరలోనే కట్టించేలా ఏర్పాట్లు చేస్తామని జేసీ చెప్పారు. సెస్ పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదు. గ్రంథాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇచ్చే స్థితిలో లేదని, స్థానిక సంస్థల నుంచే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది.
– వి.వి.జి.శంకరరావు,
జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి(ఎఫ్‌ఏసీ)
గ్రంథాలయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం మంచిది కాదు. మూడు నెలలుగా జీతాలు, పెన్షన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లు ఆకలి చావులకు చేరుకోక మునుపే మాపై కనికరించాలి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. అదనపు బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపితే, గ్రంథాలయ పన్ను నుంచి లైబ్రరీ సెస్ వినియోగించుకోమని ఆదేశాలు ఇస్తున్నారు. మా సమస్యలపై జిల్లా అధికారులతో పాటు ఆర్థిక శాఖ మంత్రి, పౌర గ్రంథాలయ శాఖ మంత్రికి విన్నవించినా ఫలితం కనిపించడం లేదు.
– టి.వైకుంఠరావు, అధ్యక్షుడు,
జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ అసోసియేషన్
జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. ఇటీవలే రాష్ట్రస్థాయిలో రివ్యూ మీటింగ్ పెట్టాం. మంత్రి నారా లోకేష్‌కు సమస్య వివరించాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిధుల కోసం కృషి చేస్తన్నాం. మన జిల్లాలో కూడా ఇళ్లు, పంచాయతీల నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా చూస్తాం.
– పీరుకట్ల విఠల్,
జిల్లా గ్రంథాలయ చైర్మన్


