‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?’ | - | Sakshi
Sakshi News home page

‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?’

Feb 26 2026 7:24 AM | Updated on Feb 26 2026 7:24 AM

‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?’

‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?’

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి దారుణమని మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రోడ్డు మరమ్మతుల పనులు సక్రమంగా నిర్వహించకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం, ప్రభుత్వ పరిపాలన లోపాలను బయటపెడుతోందన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే ఉన్నత స్థాయి నిపుణులను నియమించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement