మాస్టర్స్‌ పోటీలకు సిద్ధమా! | - | Sakshi
Sakshi News home page

మాస్టర్స్‌ పోటీలకు సిద్ధమా!

Mar 6 2026 8:30 AM | Updated on Mar 6 2026 8:30 AM

జిల్లాస్థాయి శాప్‌ లీగ్‌ మాస్టర్స్‌

క్రీడాపోటీల షెడ్యూల్‌ ఖరారు

తొలుత బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌, టెన్నిస్‌ క్రీడాంశాల్లో పోటీలు

35 ఏళ్లు దాటిన క్రీడాకారులకు

గొప్ప అవకాశం

శ్రీకాకుళం న్యూకాలనీ: వెటరన్‌ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) నడుం బిగించింది. శాప్‌ లీగ్‌ – మాస్టర్స్‌ స్పోర్ట్స్‌ పేరిట 35 ఏళ్లు పైబడిన మాస్టర్స్‌(వెటరన్‌) క్రీడాకారులకు క్రీడా పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో పురుషులు, మహిళలకు జిల్లాస్థాయిలో వేర్వేరుగా పోటీలు జరిపించనున్నారు. ఇక్కడ రాణిస్తే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు.

మూడు క్రీడాంశాల్లో పోరు..

శాప్‌ లీగ్‌ మాస్టర్స్‌ క్రీడా పోటీల్లో భాగంగా మొదటి విడతగా బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌, టెన్నీస్‌ క్రీడాంశాల్లో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నారు. ఆసక్తి గల వెటరన్‌ క్రీడాకారులు స్పోర్ట్స్‌.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌పోర్టల్‌లో శాప్‌ లీగ్స్‌లో రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది.

బ్యాడ్మింటన్‌: 35 ఏళ్లు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలను నిర్వహిస్తుండగా, 45 ఏళ్లుపైబడిన విభాగంలో కేవలం పురుషులకు మాత్రమే పోటీలు నిర్వహించనున్నారు. విజేతలను రాష్ట్రస్థాయిలో మార్చి 14, 15 తేదీల్లో జరిగే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో జరగనున్నాయి.

టెన్నిస్‌: 40 ఏళ్లు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మార్చి 22, 23 తేదీల్లో విజయనగరం జిల్లా వేదికగా జరిగే రాష్ట్రపోటీలకు పంపిస్తారు.

అథ్లెటిక్స్‌: 35 ఏళ్లు పైబడి, 45 ఏళ్లు పైబడిన విభాగాల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడి విజేతలను మార్చి 30, 31 తేదీల్లో గుంటూరు వేదికగా జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు.

గేమ్‌ తేదీ ఈవెంట్స్‌ వేదిక

టెన్నిస్‌ మార్చి 8న సింగిల్స్‌, డబుల్స్‌ ఆర్ట్స్‌ కళాశాల

మిక్స్‌డ్‌ డబుల్స్‌ శ్రీకాకుళం

బ్యాడ్మింటన్‌ మార్చి 8న సింగిల్స్‌, డబుల్స్‌ ఇండోర్‌ స్టేడియం

మిక్స్‌డ్‌ డబుల్స్‌ శ్రీకాకుళం

అథ్లెటిక్స్‌ మార్చి 24న 100, 400,800,

1500 మీటర్ల పరుగు, కేఆర్‌ స్టేడియం

లాంగ్‌జంప్‌, హైజంప్‌, శ్రీకాకుళం

షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో,

లావెలన్‌, రిలే పరుగు

సద్వినియోగం చేసుకోండి..

35 ఏళ్లు పైబడిన వెటరన్‌ క్రీడాకారులకు శాప్‌ లీగ్‌ పోటీలు గొప్ప అవకాశం. తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సన్నద్ధంకావాలి. తొలుత టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఇక్కడి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తాం. వివరాలకు 9390352942 నంబర్‌ను సంప్రదించవచ్చు. – ఎ.మహేష్‌బాబు,

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement