మాట కలుపుదాం | - | Sakshi
Sakshi News home page

మాట కలుపుదాం

Mar 8 2026 7:37 AM | Updated on Mar 8 2026 7:37 AM

మాట కలుపుదాం బిడియం అనే భయం లేకుండా పెంచాలి ఇలా చేసి చూద్దాం..

బాలికలపై పెరుగుతున్న అకృత్యాలు

ఇంటిలో చెప్పగలిగే స్వేచ్ఛ ముఖ్యం

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై అవగాహన తప్పనిసరంటున్న నిపుణులు

ఆడ పిల్లలకు చిన్న వయసు నుంచే బిడియం లేకుండా సమాజంలో ప్రతి విషయంపై అవగాహన కలిగే విధంగా పెంచాలి. ఇంటిలో గానీ, పాఠశాలలో గాని ఎక్కడైనా వారికి ఇబ్బంది కలిగే విధంగా ఎదుర్కొన్న వికృత చేష్టలను తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలిగే విధంగా వారికి భరోసా ఇవ్వాలి. అలాగే ఇంట్లో పిల్లల విషయంలో ఆడ, మగ అనే తేడాలు చూపకూడదు. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వేధింపులపై సోదరులకు క్షుణ్ణంగా చెప్పాలి. – బి.అన్నపూర్ణమ్మ,

విశ్రాంత ఉపాధ్యాయురాలు, టెక్కలి

టెక్కలి:

‘అలా చేయకూడదే..’ అని చెప్పే నానమ్మలు.. ‘ఇలా చెయ్యవే.. పర్లేదు’ అని నచ్చజెప్పే అమ్మమ్మల కాలం ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇంటిలో పెద్దవాళ్లు ఉన్నంత కాలం వాళ్లే మనకు తెలి యకుండా పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇచ్చేవాళ్లు. మంచి చెడు తేడా చెప్పేవాళ్లు. ఈ సెల్‌ఫోన్‌ యుగంలో అది కూడా చిన్న కుటుంబాల జమానాలో పిల్లలకు మంచి చెప్పే వారు, చెడును వివరించే వారు కనుమరుగైపోయారు. అందుకే ఇప్పుడు బాలికలతో మాట కలపాలి.. వారి మనసులో ఉన్న బాధనైనా, సంతోషాన్నైనా పంచుకోవాలి.

●యుక్త వయసులో ఉన్న బాలికల విషయంలో తల్లిదండ్రులకు ఓ భయం ఉంటుంది. అందుకే పిల్ల లు ఏ విషయమైనా ఇంటిలో పంచుకోగలిగే స్వేచ్ఛ ఉండాలి.

●ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలిగే మానసిక పరిపక్వత ఇంటి నుంచే పెంపొందించాలి.

●ఇంకా తమ పిల్లలు చిన్నారులే అనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి.

●మానవ సంబంధాలు, సమాజంలో జరుగుతున్న అకృత్యాల గురించి చర్చలు అత్యవసరం.

●గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి చెప్పే బాధ్యత టీచర్లదే కాదు తల్లిదండ్రులది కూడా.

●ఎవరి నుంచి ఏ విధమైన వేధింపు ఎదురైనా ‘నీ వెనుక మేమున్నాం..’ అనే ధైర్యం కల్పించాలి.

●ఇంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఖర్చులు వగైరా గురించి పూర్తి అవగాహన కల్పించాలి.

●అవసరమైనంత వరకే సెల్‌ఫోన్‌ వినియోగం శ్రేయోదాయకం.

●బాలికలకే కాదు.. అమ్మాయిలతో ఎలా మసలుకోవాలో ఇంటిలో ఉన్న మగ పిల్లలకు కచ్చితంగా చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement