పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు | - | Sakshi
Sakshi News home page

పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 7:19 AM

పాపయ్

పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు

పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు

నరసన్నపేట: గొట్టిపల్లి రెవెన్యూ పరిధిలోని వంశధార మెయిన్‌ చానెల్‌కు ఆనుకొని ఉన్న పాపయ్య చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా జేసీబీలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని రూ. 600 నుంచి రూ. 800 లకు విక్రయిస్తున్నారు. ఈ చెరువుకు ఆనుకొని వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. చెరువు గట్టు మట్టిని కూడా తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.

ఆగని దోపిడీ

ఇచ్ఛాపురం: బాహుదాలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. పట్టణంలో బాహుదా నదిలోని వంతెనలకు సమీప ప్రాంతాల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఇసుకను రెవెన్యూ కార్యాలయం పోలీస్‌స్టేషన్‌ మీదుగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు గానీ ఇసుకపై పర్యవేక్షణ చేయడం లేదు.

పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు 
1
1/1

పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement