రోజుకో ఇన్‌చార్జి కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

రోజుకో ఇన్‌చార్జి కమిషనర్‌

Feb 28 2026 7:07 AM | Updated on Feb 28 2026 7:07 AM

రోజుక

రోజుకో ఇన్‌చార్జి కమిషనర్‌

శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్‌గా రోజుకొకరిని మున్సిపల్‌ శాఖ నియమిస్తోంది. కమిషనర్‌ను సస్పెండ్‌ చేసిన తర్వాత వచ్చిన ఉత్తర్వుల్లో మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ఆయన స్థానంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ను ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఆయనకు సహాయకునిగా జీవీఎంసీ కమిషనర్‌ నల్లనయ్యను నియమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు జారీ అయిన గంటలోనే దాన్ని రద్దు చేస్తూ జీవీఎంసీలో కమిషనర్‌గా పనిచేస్తున్న బొడ్డేపల్లి రామును కమిషనర్‌కు సహాయకునిగా నియమిస్తున్నట్లు మళ్లీ ఉత్తర్వులు వెలువరించింది. రోజుకో పేరుతో ఎందుకంత గందరగోళం సృష్టిస్తున్నారో నగర వాసులకు అర్థం కావడం లేదు. నల్లనయ్యకు శ్రీకాకుళం నగరంపై మంచి పట్టు ఉండడం వల్ల తొలుత ఆయనను నియమించారు. అయితే ఆయన నియామకాన్ని ఎందుకు రద్దు చేశారన్నది అర్థం కావడం లేదు. కొత్తగా ఇన్‌చార్జి కమిషనర్‌ సహాయకునిగా వస్తున్న రాము కేవలం పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా వంటి వాటిని మాత్రమే పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.

శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌కు సహాయకునిగా బొడ్డేపల్లి రాము

అంతకుముందు నల్లనయ్య పేరిట ఉత్తర్వులు వెలువరించి ఉపసంహరించుకున్న అధికారులు

రోజుకో ఇన్‌చార్జి కమిషనర్‌ 
1
1/1

రోజుకో ఇన్‌చార్జి కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement