అన్ని విధాలా కౌన్సిలింగ్
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
ఆపదలో వుండే మహిళలు శక్తియాప్‌లో ఫిర్యాదు చేస్తే క్షణాల్లో మా పోలీసులు వెళ్తారు. అత్తింటి, భర్త సాధింపులైతే కౌన్సిలింగ్ చేస్తాం. వీడియో న్యూడ్ కాల్స్ చేయవద్దు. లివింగ్ రిలేషన్ షిప్ పై అప్రమత్తత అవసరం. రాత్రిపూట ఒంటరి గా ఎక్కడైనా చిక్కుకుపోతే షెల్టర్ కల్పిస్తాం. లేదంటే సిబ్బందితో పంపిస్తాం. విమెన్ హెల్ప్ డెస్క్‌లున్నాయి.. 112కు కాల్‌చేసినా చాలు.
– నారీమణి, సీఐ,
శ్రీకాకుళం మహిళా పోలీస్‌స్టేషన్
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పాటు పడుతున్నారు డాక్టర్ రోణంకి హరిత. దశాబ్దంన్నర మునుపు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన ఈమె వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. అనేక పరిశోధనలతోపాటు పలు యూనివర్సిటీలకు పాఠ్య పుస్తకాలు రాశారు. అనేక జర్నల్స్ ప్రచురించారు. ప్రఖ్యాత సద స్సులు, సెమినార్లలో ఉత్తమ లెక్చరర్‌గా తన వాణిని వినిపించారు. కళాశాలకు నాక్ మెరుగైన గ్రేడ్ రావడంలో కీలకభూమిక పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఏడేళ్ల నుంచి ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా, ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్‌గా సేవలు అందిస్తున్నారు.
శ్రీకాకుళం కల్చరల్: ‘ఒక రోజు నా సొంత బిజినెస్ ప్రారంభించాలి. అలాగే మిస్ ఇండియా అవ్వాలి.’ ఆమె కన్న కలలు ఇవి. ఆ కలలపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ దారిలోనే పయనించారు. అనుకున్నది సాధించి కిరీటం గెలిచే వరకు చేరుకున్నారు. ఆమె మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రన్నరప్‌గా నిలిచిన చింతలపూడి మేఘనారావు. తల్లిదండ్రుల సహకారం ఉండడంతో అనుకున్నది సాధించారు. ఈ ఫిబ్రవరి నెలలో జరిగిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్–2026 పోటీలో రన్నరప్‌గా నిలిచారు. డార్జిలింగ్ మెమోస్ అనే ఫుడ్ బిజినెస్‌కు ఓనర్‌గానూ రాణిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన ఈమె ఇన్ని విజయాలు సాధించడానికి కారణం పట్టుదలే అని చెబుతున్నారు.
అమ్మ నవ్వుతూ నడయాడే ఇల్లు.. అమ్మాయి ధైర్యంగా తిరగ్గలిగే ఊరు..
అతివలను ఆదరించి, గౌరవించే ప్రాంతం. ఇంతుల విజయాలకు చిరునామాలుగా ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఉన్నందునే మన సిక్కోలు పడతులు
గుర్తింపు తెచ్చే విజయాలు సాధిస్తున్నారు. కీర్తి కిరీటాలు అందుకుంటున్నారు.
జిల్లా కీర్తిపతాకను ఎగురవేస్తున్నారు. మన ఆడపడుచులు ప్రశంసలు పొందుతున్నారు.
వారి విజయాలే స్ఫూర్తి మంత్రాలై ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి. ‘అమ్మా.. జాగ్రత్త’ అని
లోగొంతు వినిపించే చోట ‘రేయ్.. జాగ్రత్త’ అన్న కరకు గొంతు కూడా దిక్కులు
పిక్కటిల్లజేయాలి. అందుకే మహిళా దినోత్సవం వేళ ‘షి’క్కోలు విజయ వనితల పరిచయమాల.
–సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీల్లో
టీమ్ యాగ్జిలేటర్ గోకార్ట్ వాహనంతో రైడర్, కో రైడర్, కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు బి.పవిత్ర, ఎస్.శివాని,
కె.రోహిత్ వర్మ, సిహెచ్.రుచిర యాదవ్ తదితరులు
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీ ల్లో భాగంగా హైదరాబాద్ బీవీఆర్‌ఐటీ కళాశాలకు చెందిన యువతులు ప్రత్యేకంగా నిలిచా రు. ఎంతో సాహసోపేతమైన గోకార్టింగ్ పోటీల్లో భాగంగా ‘టీమ్ యాగ్జిలేట ర్’ వాహనానికి వారధులుగా.. సారథులుగా అమ్మాయిలే వ్యవహరించారు. ఈవీ విభాగంలో తయారు చేసిన ఈ వాహనానికి బి.పవిత్ర రైడర్‌గా, ఎస్. శివాని సహాయ రైడర్‌గా వ్యవహ రించారు. కె.రోహితవర్మ, సిహెచ్.రుచిర యాదవ్ తదితర విద్యార్థినులు కెప్టెన్‌లుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ చూ పడంతో బెస్ట్ ఉమెన్ టీమ్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు ఫర్ ఫ్యాకల్టీ అడ్వైజర్, క్వాలిఫై ఫస్ట్ టెక్నిక ల్ ఇన్‌స్పెక్షన్, లైట్ వెయిట్ వాహనంగా గుర్తింపు, విన్నర్ ఎక్స్‌లిరేషన్ తదితర విభాగాల్లో విజేతలుగా నిలిచి నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు.
అందరిలో ప్రత్యేకంగా నిలవాలనే లక్ష్యంగా ఈ గో కార్టింగ్ రైడ్‌ను ఎంచుకున్నాం. 5 విభాగాల్లో క్వాలిఫైగా నిలిచి నగదు బహుమతి సాధించాం. మా బృందంలో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. అందరి సమష్టి కృషితో వాహనాన్ని తయారు చేసి పోటీల్లో పాల్గొంటున్నాం.
– టీమ్ యాగ్జిలేటర్ గోకార్ట్ వాహనం రైడర్,
కో–రైడర్, కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు బి.పవిత్ర,
ఎస్.శివాని, కె.రోహితవర్మ, సీహెచ్ రుచిర యాదవ్
గేదెల దుర్గాప్రశాంతి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన సెపక్‌తక్రా క్రీడాకారిణి గేదెల దుర్గాప్రశాంతి చరిత్ర సృష్టించింది. శ్రీకాకుళం విజయ కేతనాన్ని శ్రీలంకలో ఎగరేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 6వ ఏషియన్ మహిళల అంతర్జాతీయ సెపక్‌తక్రా చాంపియన్ షిప్– 2026 పోటీల్లో భారత జట్టుకు మన సిక్కోలు క్రీడా కుసుమం దుర్గాప్రశాంతి ఎంపికవడమే కాకుండా.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకభూమిక పోషించింది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భారత జట్టుకు ఎంపికై న ఏకై క క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన దుర్గాప్రశాంతి గేదెల నర్సింహులు, పుణ్యావతిల కుమార్తె.
శ్రీకాకుళం కల్చరల్: స్వాతీ సోమనాథ్.. పరిచయం అక్కర్లేని పేరు. కూచి పూడి కళలో రాణిస్తూ సిక్కోలు ఖ్యాతిని విదేశాలలో ఎగురవేస్తున్నారు. సంప్రదాయం నృత్య పాఠశాలలో వందలాది మందిని తయారు చేస్తున్నారు. ఆమె సొంతంగా 13 బ్యాలేలు రూపొందించారు. మహిళలు కేవలం భయం వల్లనే ఎన్నో అవకాశాలు వదులుకుంటున్నారని ఆమె చెబుతున్నారు. ఆ భయం వదిలితే లోకాన్ని జయించగలరని అంటున్నారు.
శ్రీకాకుళం కల్చరల్: సంకల్ప సిద్ధి ఉంటే ఆశయ సాధన అదే జరుగుతుందని నిరూపించారు కోల రమణి. దివ్యాంగురాలైనా వెరవకుండా వాలీబాల్ పోటీల్లో అదరగొట్టారీమె. గార మండలం అంపోలు గ్రామానికి చెందిన రమణి ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున జాతీయ స్థాయి పారాసిటింగ్ వాలీబాల్ పోటీల్లో చైన్నె, రాజస్థాన్, యూపీల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. మరోవైపు టాలీ నేర్చుకుని నగరంలోని ఓ షాపులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.
జి.సిగడాం: తల్లి స్వేదం కుమారుడికి నవ వేదమైంది. అమ్మ కష్టమే కొడుక్కి స్ఫూర్తినిచ్చింది. కష్టపడి పనిచేసి చదివించిన ఆమెకు ‘సివిల్స్ విజేత తల్లి’ అనే అపురూప కానుకను ఇచ్చా డు ఆ బిడ్డ. జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్‌లో ఆల్ ఇండియాలో 463వ ర్యాంకు సాధించారు. రాము తండ్రి అసిరినాయుడు 2019లో మరణించారు. అప్పట్లో రాము హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్‌పై దృష్టి సారించాడు. తండ్రి లేకపోయినా తల్లే అన్ని విధాలుగా సాయం చేసేవారు. ఆ కష్టం వృధా పోలేదు. రాము సివిల్స్ సాధించి తల్లికి జీవితకాలపు కానుకను ఇచ్చాడు.
శ్రీకాకుళం రూరల్: ఆమె దాదాపు 14 వేల మందికి చదువు చెప్పా రు. అందులో పదివేల మంది ఉత్తరాంధ్ర వారే. అందులోనూ దాదాపు ఐదువేల మంది గిరి పుత్రికలే. చదువు చెప్పడంతో పాటు వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ తీసుకుని, వారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు బొల్లినేని మెడిస్కిల్స్ అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ. ఆదివాసీ యువతకు పారామెడికల్ విద్యను నేర్పేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీ పద్మజ టాటాస్ట్రెవ్, టెక్ మహేంద్ర, హెచ్‌పీసీఎల్ వంటి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుని బడుగుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు.
తాను పనిచేస్తున్న సంస్థలో వివిధ కోర్సులను ప్రవేశపెట్టి వాటిని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు.
కోల రమణి
పలాస: పేరులో సుకుమారం.. పోరులో కఠినత్వం ఆమె సొంతం. పలాస మండలం బొడ్డపాడు గ్రామాని కి చెందిన పోతనపల్లి కుసు మ ఎక్కడ పోరాటం జరిగి నా ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆమె ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నారు. ఆమె తండ్రి రెయ్యి పోలయ్య శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. ఆమె మామయ్య పోతనపల్లి అప్పలస్వామి నాటి శ్రీకాకుళం జిల్లా పోరాటంలో పాల్గొని 40 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి పోలీసు కాల్పుల్లో చనిపోయా రు. అత్త పోతనపల్లి జయమ్మ కూడా అజ్ఞాత జీవితం గడిపారు. కుసుమ తాత పోతనపల్లి అప్పన్న బ్రిటిష్ ఇండియాలో ఆర్మీలో హవల్దార్‌గా పనిచేశారు. ఆమె భర్త మాత్రం ఆటో డ్రైవరు కావడం గమనార్హం. ధనిక కుటుంబంలో పుట్టినా పేదల కోసం ఆమె పోరాడుతున్నారు.
లక్ష్మీపద్మజ
కుసుమ
మహిళలు జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం వారి చేతుల్లోనే ఉండాలి. అప్పుడే ‘ఆమె’కు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు. ఇంటిలో బాలికలకే కాదు బాలురుకు కూడా జాగ్రత్తలు చెప్పాలి. ఏ అమ్మాయికి పొరపాటున తగలరాదని, ఇబ్బంది పెట్టకూడదని, కఠిన చట్టాలు, సెక్షన్లు ఉండటంతో జైలు పాలు కావద్దని చెప్పాలి. ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మా పెద్దక్క అండగా నిలిచింది.
– కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ


