కోడలే కొడుకై ంది.. | - | Sakshi
Sakshi News home page

కోడలే కొడుకై ంది..

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

కోడలే కొడుకై ంది..

కోడలే కొడుకై ంది..

రణస్థలం: అనారోగ్యంలో మృతి చెందిన మామకు కోడలై కొడుకై తలకొరివి పెట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జేఆర్‌పురం పంచాయతీలోని కాపువీధికి చెందిన కరిమజ్జి రామప్పడు అనే వ్యక్తి విద్యుత్‌ శాఖలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు అప్పన్న 25 ఏళ్ల వయస్సులో విద్యుత్‌ షాక్‌తో మరణించారు. రామప్పడు భార్య కూడా అనారోగ్యంతో మరణించారు. అలాగే కొన్ని నెలల క్రితం చిన్న కుమారుడు రాంబాబు ఆకస్మికంగా మృతి చెందాడు. అలాగే తన తొడపుట్టిన తమ్ముడు కరిమజ్జి రామస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన రామప్పడు మంచం పట్టాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచాడు. ఇద్దరు కుమారులు, భార్య, తమ్ముడు మృతి చెందడం తలకొరివి పెట్టేందుకు గ్రామస్తులు తర్జనభర్జన పడ్డారు. దీంతో చిన్న కుమారుడి భార్య ఉమా తప్పనిసరి పరిస్థితుల్లో తలకొరివి పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement