● నిర్లక్ష్యమే కారణం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం ఆయన చాంబర్‌లో కలిసి విన్నవించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలెక్టర్‌తో మాట్లాడుతూ బలగలో డయేరియా వచ్చినప్పుడు ఒకరు చనిపోయారని, అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు నాలుగు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. వందలాది మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందన్నారు. దీనికి బాధ్యులైన నగరపాలక సంస్థ హెల్త్ అధికారి, వాటర్ సప్లై అధికారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. డయేరియా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. గార తదితర ప్రాంతాల్లో, వంశధార నదీ తీర గ్రామా ల్లో, తీర ప్రాంతాల్లో ఇసుకను మంత్రి లోకేష్ మనషులమంటూ దోచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇన్‌ఫిల్టరేషన్ బావులు పాడైపోయాయని, బురద నీరు వస్తోందన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులతో పాటు పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎంవీ స్వరూప్, చింతాడ వరుణ్, గేదెల పురుషోత్తం, సాధు వైకుంఠరావు, కోణార్క్ శ్రీను, రౌతు శంకరరావు, తదితరులు ఉన్నారు.


