ఘనంగా అభయాంజనేయ ఆలయ ప్రతిష్టాపనోత్సవం
ఎచ్చెర్ల : ముద్దాడ గ్రామంలో ముద్దాడ లక్ష్మీశంకర్ కుటుంబం నిర్మించిన అభయాంజనేయస్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవం గురువారం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌లు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ సనపల నారాయణరావు, బీసీ విభాగం జనరల్ సెక్రటరీ జరుగుళ్ల శంకరరావు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు నేతింటి నీలమప్పడు, నక్క కృష్ణమూర్తి, శంకర్ పాల్గొన్నారు.


