సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి

Mar 2 2026 7:19 AM | Updated on Mar 2 2026 7:19 AM

సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి

సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌లకు సంబంధించి ఎల్టీపీలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌ హారికా ప్రసాద్‌ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రాష్ట్ర 4వ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీపీఎంఎస్‌ వెబ్‌సైట్‌లో సివిల్‌ 2.0పై వస్తున్న సమస్యలు సైతం పరిష్కరించాలని కోరారు. ఎల్‌టీపీలకు ఇన్సూరెన్స్‌ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్‌టీపీలు కలసికట్టుగా ఉండాలన్నారు. సంఘ యూట్యూబ్‌ చానెల్‌ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సెక్రటరీ బాకి సురేష్‌, స్టేట్‌ ఈసీ మెంబర్‌ వాండ్రంగి శ్రీనివాసరావు, స్టేట్‌ చైర్మన్‌ ఎం.కుమారమంగళం, ప్రెసిడెంట్‌ ఎస్‌.రాంబాబు, సెక్రటరీ ఎం.లక్ష్మణ్‌, ట్రెజరర్‌ ఐ.ఆదినారాయణ, ఎక్స్‌ అఫీషియో సభ్యులు నాగ శ్రీనివాస్‌, చాపరపు శ్రీనివాస్‌, మదన్‌ గోపాల్‌, విజయరామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా ఇంజనీర్లు కామేశ్వరరావు, ఈశ్వరరావు, శశికాంత్‌, రాహుల్‌, సందీప్‌, ఎ.శ్రీనివాస్‌, రవి, కిరణ్‌, బరాటం రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement