హిరమండలం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. ఎల్‌ఎన్‌పేట మండలం అలికాం–బత్తిలి రోడ్డుపై తురకపేట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన పాపారావు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఎల్‌ఎన్‌పేట నుంచి స్వగ్రామానికి వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో పాపారావు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం రిమ్స్‌లో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం హుటాహుటిన విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాపారావు శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య శాంతమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరుబుజ్జిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


