రుణ లబ్ధిదారులకు శిక్షణ
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని రూరల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీఎంఈజీసీ, పీఎంఎఫ్‌ఎం లబ్ధిదారులకు ఆఫ్‌లైన్ ఈడీపీ శిక్షణను గురువారం ప్రారంభించారు. 35 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు రుణం తీసుకున్న వారు ఐదు రోజులు, అంతకంటే ఎక్కువ తీసుకున్న వారు పది రోజులు శిక్షణలో పాల్గొని ఈడీపీ సర్టిఫికెట్లు పొందాలన్నారు. వాటిని సంబంధిత బ్యాంక్‌ల్లో సమర్పించాలన్నారు. మార్చి 8లోగా యూనిట్లు గ్రౌండ్‌చేసి ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రామ్‌జీ, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ రమేష్‌కృష్ణ, డీపీఎంలు, ఏపీఎంలు, బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.


