5న కూర్మనాథుని డోలోత్సవం
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథుని డోలోత్సవం మార్చి 3 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల పోస్టర్‌ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు ఆవిష్కరించారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన డోలోత్సవంలో భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 3న కామదహనోత్సవం, 4న పడియ, 5న డోలోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.


