మేమున్నామని..! | - | Sakshi
Sakshi News home page

మేమున్నామని..!

Feb 27 2026 4:07 AM | Updated on Feb 27 2026 4:07 AM

మేమున

మేమున్నామని..!

● ఆర్తుల సేవలో స్వచ్ఛంద సంస్థలు

● ఆపదలో ఆదుకుంటున్న వైనం

● నేడు ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవం

సమాజ సేవలో..

మా సంస్థ ఎల్లప్పుడు సమాజ సేవలో ఉంటుంది. ఎక్కడ ఏ అవసరం ఉన్నా అక్కడ ముందుగా ఉంటాం. సేవే పరమావధిగా భావిస్తుంటాం. – నటుకుల మోహన్‌,

మెంటార్‌, లైన్స్‌క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌

కృత్రిమ అవయవాలు..

క్లబ్‌ ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నాం. హెచ్‌ఐవీ బాధితులకు ఎనర్జీ ఫుడ్‌ ప్యాకెట్లు అందించాం. మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – హారికా ప్రసాద్‌, హర్షవిల్లి లయన్స్‌ క్లబ్‌

మహిళా సాధికారత

మహిళా సాధికారత, యువత అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నాం. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. మహిళలకు కుట్టు మిషన్లు వంటివి పంపిణీ చేస్తున్నాం.

– తమ్మినేని ఉషారాణి, ప్రెసిడెంట్‌, జేసీస్‌

పర్యావరణ పరిరక్షణ..

పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు నెరవేరుస్తున్నాం. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడం, మట్టి విగ్రహాలు పంపిణీ వంటి పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– పొన్నాడ రవికుమార్‌, పర్యావరణ ఇన్‌చార్జి, లయన్స్‌ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌

శ్రీకాకుళం కల్చరల్‌: స్వచ్ఛంద సంస్థలు అంటే సామాజిక సేవా దృక్పథంతో పనిచేసే లాభాపేక్షలేనివి. ఇందులోని సభ్యులు విద్య, ఆరోగ్యం, పేదరికం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి రంగాలలో సమాజ అభివృద్ధికి సహాయపడతారు. ఇవి చట్టబద్ధంగా రిజిస్టర్‌ కాబడి, దాతల విరాళాల ద్వారా కార్యకలాపాలు చేపడుతుంటాయి. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తుంటాయి. వీరి సేవలను గుర్తిస్తూ ఏటా ఫిబ్రవరి 27న ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుతుంటారు. ‘అందరి కలయికతో సమాజ గౌరవాన్ని పునరుద్ధరించడం’ అనేది ఈ ఏడాది వీరి లక్ష్యం.

ఉద్దేశ్యం: లాభాపేక్ష రహితంగా, సమాజంలోని స మస్యలను పరిష్కరించడం, పేదలకు సహాయం చేయడం. విద్య, వైద్య సేవలను అందించడం

సేవా రంగాలు: విద్య, ఆరోగ్యం, అత్యవసర సేవ లు (విపత్తుల సమయం), పర్యావరణం, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల నిర్వహణ.

రిజిస్ట్రేషన్‌: చాలా సంస్థలు సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం, ట్రస్ట్‌ చట్టం, ఎన్‌జీవోలుగా రిజిస్టర్‌ అవుతాయి.

నిధులు: ప్రభుత్వ గ్రాంట్లు, వ్యక్తిగత దాతలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధుల ద్వారా వీటికి నిధులు సమకూరుతాయి.

లక్ష్యాలు: విద్య, ఆరోగ్య రంగాలలో మార్పు తీసుకురావడం. స్వచ్ఛంద సేవ ద్వారా నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తారు. విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలుస్తారు.

జిల్లాలో వందకుపైగా సంస్థలు

జిల్లాలో స్వచ్ఛంద సంస్థలుగా నమోదు చేసుకున్నవి వందకుపైగా ఉన్నాయి. నమోదు కాకుండా సేవలు చేసే వారూ ఉన్నారు. ఎన్నో విపత్కర పరిస్థితులలో ముందుకొచ్చి ఎంతోమంది నిస్సహాయకులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో రెడ్‌క్రాస్‌, లైన్స్‌ క్లబ్‌, రోటరీ సంస్థ, జేసీస్‌, హర్షవల్లి లయన్స్‌ క్లబ్‌ తదితర సంస్థలు ముందంజలో ఉన్నాయి.

మేమున్నామని..! 1
1/5

మేమున్నామని..!

మేమున్నామని..! 2
2/5

మేమున్నామని..!

మేమున్నామని..! 3
3/5

మేమున్నామని..!

మేమున్నామని..! 4
4/5

మేమున్నామని..!

మేమున్నామని..! 5
5/5

మేమున్నామని..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement