పొందూరు: త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న సైన్స్ సమగ్ర మహోత్సవ్–2026 పోటీలకు జిల్లా నుంచి పొందూరు కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాత్రుని ఐశ్వర్య రూపొందించిన ‘ఫార్మర్స్ ఫ్రెండ్లీ లైఫ్ సేవర్స్ స్టిక్’ ప్రాజెక్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్ ఎస్.లలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థినిని అధ్యాపక సిబ్బంది అభినందించారు.
కౌలు రైతులను పట్టించుకోవడం లేదు
సరుబుజ్జిలి: కౌలు రైతుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు కార్డులు అందించడం ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. జిల్లాలో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నా.. వారికోసం పట్టించుకున్నవారే కరువయ్యారని ఆవేదనవ వ్యక్తం చేశారు. కౌలు కార్డులకు రుణాలు, అన్నదాత సుఖీభవ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ మండల శాఖ కార్యదర్శి అదపాక రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
యువకుడిని కాపాడిన మైరెన్ పోలీసులు
మందస: మండలంలోని రట్టి గ్రామంలో వల్లభనారాయణ స్వామి డోలోత్సవ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోంపేట పట్టణంలోని గాంధీ నగర్‌కి చెందిన యువకుడు ఆర్థి వాసుదేవ్ తన స్నేహితులతో కలిసి సోమవారం సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న బారువ మైరెన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించి, ప్రథమ చికిత్స అందించి.. 108 వాహనంలో హరిపురం పీహెచ్‌సీకి తరలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని బారువ మైరెన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ కోదండరావు, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్ సంఘమేశ్వరరావు, హరిప్రసాద్ రాజు, హోమ్ గార్డ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


