హిందీ ప్రతిభారత్న పురస్కారాల ప్రదానం
రణస్థలం: హిందీ సేవాసదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో గత నెల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన హిందీ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి విద్యార్థుల ఉత్తరాంధ్ర స్థాయి అభినందన సభ ఆదివారం రణస్థలం భాష్యం స్కూల్ ఆవరణలో నిర్వహించారు. కేంద్రం ఆర్థికశాఖ హిందీ సలహా మండలి సభ్యుడు కోనే శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర సహకార, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖల హిందీ సలహా మండలి సభ్యుడు ఎస్.గైబువల్లి హాజరై ఉత్తరాంధ్ర స్థాయిలో ఆరు జిల్లాల టాపర్లకు ప్రతిభారత్న పురస్కారాలు ప్రదానం చేశారు. 60 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. హిందీ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, ఏపీ హిందీ ప్రఽచార సభ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఎల్.నాయుడు, భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.ఈశ్వరరావు, సూర్య హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ యశ్వంత్, ఎం.వి.మల్లేశ్వరరావు, హిందీ మంచ్ నాయకులు బాడ మంజుల, రామారావు, హిందీ మంచ్ విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కన్వీనర్ మహేంద్రనాథ్, పాడేరు జిల్లా ప్రతినిధి శెట్టి సూరిబాబు, వివిధ జిల్లాల ప్రతినిధులు ఎస్‌టీపీ శిరీష, ప్రభాకర్, చిన్నాదేవి, ఉమారాణి, ప్రభావతి, పద్మానాభరాజు, ఎస్.సంతోషి పాల్గొన్నారు.


