వ్యాధి వ్యాప్తి ఎలా ఉంది..?
అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి 68 కేసులు నమోదైతే బుధవారానికి ఆ కేసులు 102కి చేరుకున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం 162 మంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 10 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం డయేరియా రోగులు ఉన్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
వైద్యం ఇలా..?
జిల్లాలో విభృంజిస్తున్న డయేరియా బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నట్లుగా ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అవని (9281068139) తెలియజేశారు. డయేరియా లక్షణాలు కనిపించిన రోగులంతా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చేరాలని, ఉచిత వైద్యం పొందాలని ఆయన ప్రకటించారు. అలాగే ఈ మేరకు సహాయం కోసం మూడు బృందాలు పనిచేస్తున్నాయని, 9281068255, 9281068256, 9281068257 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
కిమ్స్‌లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు
వ్యాధి వ్యాప్తి ఎలా ఉంది..?


