ప్రభుత్వానికి మానవత్వం ఉందా..? | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?

Feb 26 2026 7:24 AM | Updated on Feb 26 2026 7:24 AM

ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?

ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): జిల్లా కేంద్రంలో డయేరియా బాధితులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తదితరులు బుధవారం పరామర్శించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కండ్రవీధి, గుడివీధి ప్రాంతాల్ని పరిశీలించారు. మృతుల కు టుంబ సభ్యులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. నలుగురుచనిపోతే ఒక్కరే చనిపోయారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు ప్రజారోగ్యంపై నిర్ల క్ష్యం నశించాలి, మంచినీరు ఇవ్వలేని కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దింపాలని నినదించారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సూరాడ కన్నబాబు, అల్లుబిల్లి విజయ, హజీభయ్యాలతో పాటు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు, కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్‌, అంధవరపు సూరిబాబు, ఎస్‌ఈసీ మెంబర్లు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్‌, డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు చింతాడ వరుణ్‌, గ్రీవెన్స్‌సెల్‌ అధ్యక్షులు రౌతు శంకరరావు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్రకార్యదర్శి పొన్నాడ రుషి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, మైనార్టీసెల్‌ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.ఏ భేగ్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్తా విజయ్‌కుమార్‌, యువ జన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, కోణార్క్‌ శ్రీనివాసరావు, గద్దిబోయిన శ్రీనివాసయాదవ్‌, డాక్టర్‌ శ్రీనివాసపట్నాయక్‌, మూకళ్ల తాతబాబు, ఎండ రమేష్‌, తారక్‌, కింజరాపు రమేష్‌, భైరి మురళి, అంధవరపు రామారావు, గుడ్ల దామోదరరావు, అలపాన త్రినాధరెడ్డి, వైశ్యరాజు మోహన్‌లతో పాటు అధిక సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

రూ.60 కోట్లు సరదాలకు ఖర్చు చేస్తారా..?

21వ తేదీన డయేరియా మొదలైతే మంగళవారం వరకు నియంత్రణ చర్యలు లేవు. డయేరియా వల్లే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని చెబుతుంటే అనారోగ్యం వల్ల చనిపోయారని కూటమి నేతలు చెప్పడం హాస్యాస్పదం. అసలు నీరు కలుషితం కావడానికి కారణమైన మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌, నీటిసరఫరా విభాగం ఏఈలను సస్పెండ్‌ చేయాలి. చంద్రబాబుకు దోపిడీ తప్ప మరే ఆలోచన ఉండదు. బలగలో డయేరియా వచ్చినప్పుడు జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు. నా హయంలో రూ.40 కోట్లతో నగరమంతా మంచినీరు అందిస్తే దాన్ని కాపాడుకోలేకపోయారు. కోవిడ్‌ వంటి పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీ సమర్థంగా పని చేసింది. ఇప్పుడు వందమందికిపైగా డయేరియా బాధితులు ఉన్నారు. వారికి మంచి వైద్యం అందించాలి. మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి మున్సిపాలిటీకి రూ.60 కోట్లు ఇస్తే దాన్ని పూర్తిగా సరదాలకు ఖర్చుచేసి పూర్తిగా మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసేయడం సిగ్గుచేటు. తాను చెప్పిన వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటు. మీ పత్రికల్లో రాసే అబద్ధాలు నమ్మే స్థితిలో జనం లేరు.

– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి

ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టారు

ప్రజారోగ్యం, వైద్య, విద్యను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. డయేరియాతో మృతి చెందారని స్వయంగా కుటుంబ సభ్యులే చెబుతుంటే దాన్ని కూటమి నేతలు వక్రీకరిస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలను పక్కనపెట్టేసి కేవలం వేలాది కోట్లు రాజధాని నిర్మాణానికి వెచ్చించడం సరికాదు. నీళ్లు తోడడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం సరికాదు. ప్రశ్నించే వారిపై అక్రమకేసులు బనాయించి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎన్న డూ లేదు. అధికారులు, కూటమి నేతల నిర్లక్ష్యం వల్లే నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

– ధర్మాన కృష్ణదాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు

మృతుందరినీ డయేరియా మృతులుగా పరిగణించాలి

శ్రీకాకుళం చరిత్రలో ఇలాంటి

సంఘటనలు జరగలేదు

ప్రభుత్వ తీరుపై మండిపడిన వైఎస్సార్‌సీపీ నాయకులు

డయేరియా బాధితులకు పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement