రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్‌గా బగాది
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామమోహనరావు రాష్ట్ర సమాఖ్య కో–చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ భవనంలో జరిగిన సమాఖ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. బగాది ఎంపిక పట్ల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హర్షం వ్యక్తం సేశారు.
పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమించాలి
పలాస: పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ ఆసుపత్రిని ఆదివారం సందర్శించారు. సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నిపుణుల సహకారంతో కిడ్నీ వ్యాధిపై పరిశోధన జరగాలన్నారు. రీసెర్చ్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలన్నారు. 59 వైద్యులకు గాను 18 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. కిడ్నీ రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం అందించాలని కోరారు. 200 పడకలకు గాను 100 పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం విచారకరమని చెప్పారు. ఆస్పత్రికి బస్సు పాయింట్ దూరంగా ఉందని, ఎలక్ట్రికల్ వాహనం సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో వేదిక నాయకులు పి.ధర్మారావు, కె.మణికుమార్, ఎన్.గణపతి పాల్గొన్నారు.
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
జి.సిగడాం : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా నాయకులు మొయ్యి జనార్దన్‌నాయుడు, మక్క సురేష్ అన్నారు. ఆదివారం జి.సిగడాంలో వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ విధానం అమలయ్యేవరకు పోరాటం ఆగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సభ్యులు బాలి రామారావు, సామంతుల సత్యనారాయణ, జాడ వెంకటరమణ, శ్రీనివాస్ పట్నాయక్, వల్లూరు రమణ, జోగిదొర తవిటిరాజు పాల్గొన్నారు.
మాజీ సైనికులకు సత్కారం
శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికులు సమాజానికి ముందుకురావాలని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల రథసప్తమి నాడు అరసవల్లిలో భక్తుల సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు, వీర నారీమణులకు చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ట్రెజరర్ ఎం.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
శ్రీకూర్మంలో భక్తుల రద్దీ
గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో వేకువ జామున స్వామికి పంచామృతాభిషేకం, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈఓ టి.వాసుదేవరావు భక్తుల క్యూలైన్ పర్యవేక్షించారు,
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్‌గా బగాది
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్‌గా బగాది
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్‌గా బగాది
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్‌గా బగాది


