నాణ్యమైన వైద్యసేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యసేవలందించాలి

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

నాణ్య

నాణ్యమైన వైద్యసేవలందించాలి

శ్రీకాకుళం: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ అన్నారు. జిల్లాలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆర్థిక సహకారంతో ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సత్తి శ్రీనివాసరావును విజయవాడలోని మంత్రి కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలానే లేబర్‌ రూమ్‌, ఫార్మసీ, వార్డ్‌, ల్యాబరేటరీ గార్డెన్లకు అత్యాధునిక సదుపాయలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ బద్దెల సురేష్‌ పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత

టెక్కలి రూరల్‌: స్థానిక జగతిమెట్ట సమీపంలో శనివారం ఉదయం అక్రమంగా పశువులను తరలిస్తున్న నాలుగు బొలేరో వ్యాన్లను టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిలి సమీప ప్రాంతాల నుంచి సంతలకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా 4 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాటిలో మూడు వాహనాల్లో మొత్తం 14 గేదెలతో పాటుగా ఒక బొలేరో వాహనంలో 4 ఆవులు ఉన్నాయి. వాహనాలను టెక్కలి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించనున్నట్లు తెలిపారు.

ఇత్తడి సామగ్రి చోరీపై ఫిర్యాదు

టెక్కలి రూరల్‌: మండంలోని తలగాం గ్రామానికి చెందిన హనుమంతు విద్యాసాగర్‌ అనే వ్యక్తి తన ఇంట్లో ఉంచిన సామగ్రి కనిపించడం లేదని టెక్కలి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. విద్యాసాగర్‌ తెలంగాణలోని భద్రాచలంలో పేపర్‌ బోర్డులో టెక్నికల్‌ అడ్వైజరుగా పనిచేస్తున్నారు. అయన ఈనెల 27వ తేదీన తన సొంత గ్రామమైన తలగాంలోని ఇంటికి వచ్చారు. అనంతరం స్టోర్‌ రూమ్‌కి వెళ్లి చూడగా అందులో ఉంచిన సుమారు 100 కేజీల ఇత్తడి సామగ్రితో పాటు 3 గ్రాముల బంగారు కాసులు కన్పించడం లేదని తెలిపాడు. ఈ మేరకు సామగ్రి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైతుల వివరాలను నమోదు చేయాలి

డీపీఎం పూజారి సత్యనారాయణ

ఆమదాలవలస: ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో కృషి మేపర్‌ పోర్టల్‌కు అనుసంధానం కోసం రైతుల వివరాలను ‘ఉర్వి’ యాప్‌లో నమోదు చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్‌ పూజారి సత్యనారాయణ సూచించారు. మండలంలోని చీమలవలస గ్రామంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ ప్రక్రియ ఐసీటీఎన్‌ఎఫ్‌ఏ శివకృష్ణ పర్యవేక్షణలో కొనసాగుతోందని చెప్పారు. చీమలవలస, కట్యాచార్యులపేట, వంజంగి, జొన్నవలస, దూసి, కలివరం పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సీడీఎఫ్‌ సురేష్‌ ఆధ్వర్యంలో వివరాల నమోదు ప్రక్రియను ట్రైనీ ఐసీఆర్‌పీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది రైతుల భూ వివరాలను ఖచ్చితంగా జియోట్యాగ్‌ చేసి, రైతుల ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, ఫీల్డ్‌ స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యమైన వైద్యసేవలందించాలి 1
1/2

నాణ్యమైన వైద్యసేవలందించాలి

నాణ్యమైన వైద్యసేవలందించాలి 2
2/2

నాణ్యమైన వైద్యసేవలందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement