● వీడిన పొన్నాడ హత్య కేసు మిస్టరీ
● నిందితుడి అరెస్టు
● ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సాన్నిహిత్యాలే
హత్యకు కారణం
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద
హత్యకు
ఉపయోగించిన లావుపాటి కర్ర
శ్రీకాకుళంక్రైమ్ : విశృంఖల వాంఛలు ఒకరి ప్రాణా లు తీయగా.. మరొకరిని జైలుపాలు చేశాయి. గత నెల 26న ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ వెంకన్నగారిపేట మార్గం రాజీవ్‌గారి తోటలో పైలా మోహనరావు (43)ను హత్య చేసిన సంగతి తెలిసిందే. మోహన్‌ను హత్య చేసింది శ్రీకాకుళం హయాతినగరానికి చెందిన అలబోయిన ఢిల్లీశ్వరరావు (21) అని, ఇద్దరి మధ్య విశృంఖల శృంగారం, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలు శ్రీకాకుళం సబ్‌డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియా సమావేశంలో వెల్లడించారు.
పరిచయమిలా..
మోహన్ గత 15 ఏళ్లుగా వాంబేకాలనీలో నివసి స్తూ టిఫిన్, కిరాణా వ్యాపారం చేస్తూనే చీటీ పాటలు కూడా నడుపుతుండేవాడు. అంతేకాక జిల్లా హిజ్రా సంఘాలకు నాయకునిగా వ్యవహరిస్తుండేవాడు. ఈ క్రమంలో నగరంలో ఆశీలు వసూలు చేస్తున్న ఢిల్లీశ్వరరావుతో మోహన్‌కు పరిచయమైంది. నగరంలోనే వీరు వేరేగా గది అద్దెకు తీసుకుని ఉండేవారు. ఢిల్లీ బర్త్‌డే ఫంక్షన్‌ను హిజ్రాలతో సెలబ్రేట్ చేసి తన భర్త ఢిల్లీ అని మోహనరావు ప్రకటించాడు కూడా.
రూ.10 లక్షలు, ఇల్లు ఇస్తానని..
ఈ క్రమంలో గత ఏడాది డిసెంబరులో ఇద్దరూ మద్యం తాగి ఆ మత్తులో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. మోహన్ తనకుండే ఓ వ్యాధిని ఢిల్లీకి అంటించానని చెప్పడంతోనే ఈ గొడవ జరిగింది. ఢిల్లీ ఈ విషయం మోహన్ కుటుంబసభ్యులకు చెబుతాననగా రూ. 10 లక్షలు, ఇల్లు ఇస్తాను, ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకుంటాన ని మోహన్ నచ్చజెప్పాడు. ఎప్పటికీ ఇవ్వకపోవడంతో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నా వినలేదు. దీంతో కక్ష పెట్టుకున్న ఢిల్లీశ్వరరావు మోహన్‌ను అంతమొందించాలని ప్లాన్ వేశాడు.
అరసవల్లి గుడికని చెప్పి..
ఢిల్లీశ్వరరావుకు వరసకు మేనల్లుడైన పాలకొండకు చెందిన కార్తీక్‌ను అరసవల్లి గుడికి వెళ్దామని, కారు బుక్‌చేసుకుని రమ్మని గత నెల 26న పిలిచాడు. కార్తీక్‌కు తోడుగా అతని మిత్రుడు ప్రశాంత్‌ను తీసుకురమ్మన్నాడు. వీరితోపాటు డ్రైవర్ సాయి వచ్చా డు. వీరిలో కార్తీక్ ఇంజినీరింగ్ విద్యార్థి కాగా, ప్రశాంత్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా డు.మధ్యలో ఒకరు డబ్బులు ఇవ్వాల్సి ఉందని ఢిల్లీ శ్వరరావుచెప్పి ఎచ్చెర్ల తోటపాలెం మార్గంలో కారు లో వచ్చి మద్యం బాటిళ్లు, ఫుడ్ కొని తోటకు వెళ్లా రు. అక్కడ కార్తీక్ తప్ప మిగతా ఇద్దరు మద్యం సేవించారు. ఈలోగా మోహన్‌కు ఫోన్ చేసి రమ్మనడం.. అతడి బండి స్టార్ట్ కాకపోవడంతో పొన్నాడ వంతెన వద్ద కు వెళ్లి మోహన్‌ను పికప్ చేసుకున్నారు.
కారులోనే కత్తితో పొడిచి..
మోహన్, ఢిల్లీల మధ్య కారులోనే మాటామాటా పెరగడంతో కత్తితో మోహన్‌పై ఢిల్లీ దాడి చేశాడు. కారులో ఉన్న వారు బెదిరిపోవడంతో డ్రైవింగ్ సీటులో ఉన్న సాయిని కత్తితో చంపేస్తానని బెదిరించి తోట వైపు తీసుకెళ్లమన్నాడు. తోటకు వెళ్లి కారు నుంచి దిగిన వెంటనే మోహన్‌పై లావుపాటి కర్ర, కత్తితో ఢిల్లీ దాడి చేస్తుండటంతో కార్తీక్, సాయి కారులో పారిపోయారు. అక్కడ ఉన్న ప్రశాంత్ అడ్డుకోబోగా అతడిని సైతం బెదిరించడంతో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఘటనా స్థలిలో ఎవరూ లేకపోవడంతో ఢిల్లీ ఒక్కడే కసి తీరా మోహన్‌ని చంపేశాడని డీఎస్పీ చెప్పారు.


