సచివాలయ సర్వేయర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

సచివాలయ సర్వేయర్ల నిరసన

Mar 8 2026 7:38 AM | Updated on Mar 8 2026 7:38 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : గ్రామ సచివాలయ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు శాంతియుతంగా వినతిపత్రం అందజేస్తే.. అధికారులు వాటిని పరిష్కరించకపోగా సస్పెన్షన్లతో గొంతునొక్కడం తగదంటూ సుమారు నాలుగు వందల మంది సర్వే ఉద్యోగులు శనివారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర అధ్యక్షుడిని సస్పెండ్‌ చేయడం తగదంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని, అధికారుల తీరును తప్పుపట్టారు. విషయం తెలుసుకున్న సర్వే శాఖ ఏడీ జోస్లీ తక్షణ చర్యగా గ్రామ సచివాలయం సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు మజ్జి అప్పలనాయుడును సస్పెండ్‌చేశారు. దీంతో తోటి సర్వేయర్లు నిరసన తీవ్రతరం చేశారు. అందరిని సస్పెండ్‌ చేయాలని, ప్రస్తుతం విధులకు హాజరయ్యే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement