విద్వేషాలు రెచ్చగొట్టడం అచ్చెన్నకు తగదు | - | Sakshi
Sakshi News home page

విద్వేషాలు రెచ్చగొట్టడం అచ్చెన్నకు తగదు

Mar 5 2026 7:42 AM | Updated on Mar 5 2026 7:42 AM

పాతపట్నం : ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మండలి చైర్మన్‌ కొయ్యె మోషేనురాజులను క్రిస్టియన్‌ అంటూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం పాతపట్నంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసన మండలిలో చర్చ జరగకుండా అచ్చెన్నాయుడు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తు న్నారని, చర్చకు ప్రభుత్వం భయపడుతుందని చెప్పారు. బీఏసీ సమావేశంలో చర్చకు అంగీకరించి సభలో మాట తప్పడం తగదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం, అసందర్భ వ్యాఖ్యలు చేయడం అచ్చెన్నాయుడుకు సరికాదన్నారు. తప్పుడు వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు దెబ్బతీయవద్దన్నారు. అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు మిరియబిల్లి శ్యామ్‌సుందరరావు, ఉర్లాన బాలరాజు, చింతాడ సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్‌, పెనుమజ్జి విష్ణుమూర్తి, మీసాల రా మకృష్ణ, గండివల ఆనందరావు, పోలాకి జయమునిరావు, బైపోతు ఉదయ్‌కుమార్‌, జి.సంజీవ్‌, జి. రాము, పి.మోహన్‌, ఎం.గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement