ఆగని డయేరియా కేసులు | - | Sakshi
Sakshi News home page

ఆగని డయేరియా కేసులు

Mar 5 2026 7:42 AM | Updated on Mar 5 2026 7:42 AM

నేర నియంత్రణకు పటిష్ట చర్యలు శ్రీకాకుళం క్రైమ్‌ : పాత నేరస్థులపై నిఘా పెట్టి నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, కోర్టు వ్యవహారాలు, నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్లు అమలు, పాత నేరస్తులకు కౌన్సెలింగ్‌, మెరుగైన పోలీసు సేవలపై సమీక్షించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తునకు కారణాలు, పాటించాల్సిన నియమాలపై స్పష్టంగా ఆదేశాలిచ్చారు. డ్రంక్‌ అండ్‌డ్రైవ్‌ తనిఖీలు, ఈ–చలానాల విధింపు, వసూళ్ల పురోగతి, కార్టన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్లు, రాత్రి గస్తీ, బీట్‌లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 112 కాల్స్‌పై తక్షణమే స్పందించాలని సూచించారు. సమావేశశంలో అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పాత్రిని శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్‌ వివేకానంద, లక్ష్మణరావు, ఎస్బీ సీఐ ఇమ్మాన్యుయల్‌ రాజు, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీల్లో సిక్కోలు ప్రతిభ

శ్రీకాకుళం : నగరంలోని మంగువారితోట, దండి వీధి, లెప్రసీ కాలనీ తదితర ప్రాంతాల్లో మళ్లీ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రెండు కేసులు ఈ ప్రాంతం నుంచి నమోదై లెప్రసీ కాలనీలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు పొందగా బుధవారం వారి ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో డిశ్చార్జ్‌ చేశారు. వారు వెళ్లిన క్షణాల్లోనే లెప్రసీ కాలనీ నుంచి మరో ఇద్దరు వచ్చి ఆరోగ్య కేంద్రంలో చేరారు. ఆ ప్రాంతంలో చాలామందికి డయేరియా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం సరికి ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: ఖేలో ఇండియా సౌత్‌జోన్‌ పెన్‌కాక్‌ సిలాట్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు కేరళలో జరిగిన సౌత్‌జోన్‌ అస్మిత ఖేలో ఇండియా పెన్‌కాక్‌ సిలాట్‌ ఉమెన్స్‌ లీగ్‌ పోటీల్లో జూనియర్స్‌ విభాగంలో సాహుకారు సహస్ర, చింతపల్లి హేమసుధ కాంస్య పతకాలు సాధించగా, నేతింటి చరిష్మా, అన్నెపు భార్గవి గట్టి పోటీనిచ్చారు. కోచ్‌ మాకివలస గౌతమి, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రేగిడి దయామయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్‌ నాయుడు క్రీడాకారులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement