మండలి చైర్మన్‌పై అచ్చెన్న వ్యాఖ్యలు దారుణం | - | Sakshi
Sakshi News home page

మండలి చైర్మన్‌పై అచ్చెన్న వ్యాఖ్యలు దారుణం

Mar 6 2026 8:03 AM | Updated on Mar 6 2026 8:03 AM

మండలి చైర్మన్‌కు క్షమాపణ చెప్పాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ డిమాండ్‌

నరసన్నపేట: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజుపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ సభ్యు లు అవమానకరంగా మాట్లాడారని, కుల మతాల పేరుతో దూషించడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే మండలి చైర్మన్‌ మతా న్ని ఎత్తి చూపడాన్ని తీవ్రంగా ఖండించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యత కలిగిన మంత్రి ఇలా మండలి చైర్మన్‌ను కించపరిచే విధంగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. సభను హుందాగా నడిపిస్తున్న మండలి చైర్మన్‌కు సహకరించాల్సింది పోయి ఇలా వ్యవహరించడాన్ని తప్పు పట్టారు. మొత్తం సభా మర్యాదను మంటగలిపారని అన్నారు. హెరిటేజ్‌ అవినీతి అంశాలు, కల్తీ నెయ్యి సరఫరా వంటి కీలక విషయాల్లో తెలుగు దేశం బండారం బయట పడుతుందనే భయంతోనే అచ్చెన్నాయుడు ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కుల మతాల ప్రస్తావన తెస్తున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో కాళింగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళీ ధర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేఽశ్వరరావు, పార్టీ పొందర కూరాకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్న, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కేసీహెచ్‌బీ గుప్త పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement