గార: శ్రీకూర్మనాథుడి ఉత్తరాభిముఖంగా దర్శనంతో భక్తులు పులకించిపోయారు. శ్రీకూర్మనాథాలయం నుంచి గురువారం ఉదయం స్వామి మూర్తులు (శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి) మాడ వీధుల గుండా గ్రామశివారున గ్రామదేవత మోహినీ భద్రాంబికా ఆలయం సమీపంలోని డోలోమంటపం వద్దకు తీసుకువెళ్లారు. అప్పటికే సిద్ధం చేసిన ‘ఊయల’పై స్వామి ఉత్సవమూర్తులను వేంచింపచేసిన అర్చక బృందం అష్టోత్తర నామార్చన అనంతరం ప్రత్యేకంగా బుక్కా–భర్గుండతో పూజలు జరిపారు. కాసే పు స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమివ్వగా, భక్తులు కూర్మనాథ స్వామి పాదం తాకేందుకు పోటీపడ్డారు. ‘శ్వేతపుష్కరిణి’తో పాటు ‘శ్రీకూర్మ–మత్స్యలేశం’ లోనూ భక్తులు పవిత్ర స్నానా లు చేసి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. సాయంత్రం వేళ డోలో మంటపం నుంచి తిరిగి స్వామి శ్రీకూర్మనాథాలయానికి చేరుకోవడంతో ఈ ఉత్సవం ముగిసింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, పాలకమండలి సభ్యు లు కై బాడి కుసుమకుమారి, అర్చకులు గోపినంబాళ్ల దాసుబాబు, కిషోర్‌బాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


