వసంతోత్సవం అంటారు | - | Sakshi
Sakshi News home page

వసంతోత్సవం అంటారు

Mar 3 2026 7:21 AM | Updated on Mar 3 2026 7:21 AM

వసంతోత్సవం అంటారు సహజ రంగులు వాడాలి రసాయన రంగులు చర్మానికి ప్రమాదకరం

హిందూ సంప్రదాయంలో ఈ ఉత్సవాన్ని వసంతోత్సవంగా పిలుస్తారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కామదహనోత్సవం, రెండో రోజు పడియా సందర్భంగా సముద్ర స్నానాలు చేస్తారు. మూడో రోజున స్వామివారిని తోటలోని డోలో మండపంలో ఉంచి ఊయలలో ఊపుతూ డోలోత్సవం నిర్వహిస్తాం.

– ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకులు,

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం

కళ్లకు, చర్మానికి ఎలాంటి ప్రమాదం రాకుండా సహజ రంగులు వాడాలి. రసాయన రంగుల వల్ల కళ్లలో రంగు పడితే ఎరుపుగా అయి కళ్లలో నీరుకారుతుంది. అలాగే చర్మ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు పాటించాలి.

– ఎంఆర్‌కే దాస్‌, ఆఫ్తాలమిక్‌ ఆఫీసర్‌

హోలీలో కొంత మంది రసాయన రంగులు వినియోగిస్తుంటారు. ఇది చర్మానికి ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా చిన్న పిల్లల చర్మంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. చర్మం అలర్జీలు ఉన్నవారు వీలైనంత మేరకు రంగులు పడకుండా దూరంగా ఉండాలి.

– ఆర్‌.జ్యోతి, చర్మవ్యాధి నిపుణులు,

జిల్లా ఆస్పత్రి, టెక్కలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement