ఉత్సాహంగా శాప్‌ లీగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా శాప్‌ లీగ్‌ పోటీలు

Mar 9 2026 7:17 AM | Updated on Mar 9 2026 7:17 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్‌లీగ్‌ మాస్టర్స్‌ పోటీలు మొదలయ్యాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ జిల్లాస్థాయి పోటీలకు జిల్లా నలుమూలల నుంచి వెటరన్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్స్‌ హాజరై తమ ప్రతిభ ను నిరూపించుకున్నారు. బ్యాడ్మింటన్‌ అసోసియేష న్‌ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు ఈ ఎంపిక పోటీలను పర్యవేక్షించారు. 35 ఏళ్లపైబడిన విభాగం సింగిల్స్‌లో ఎ.మోహనరావు, డబుల్స్‌లో ఎ.మోహనరావు–వై.లక్ష్మణరావు జంట విజేతలగా నిలిచారు. అలాగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కిల్లి హరీష్‌–ఐ.ఆశాలత జంట విజేతలుగా నిలిచారు. 45 ఏళ్లు పైబడిన విభాగం సింగిల్స్‌లో నాగేశ్వర్‌బెనర్జీ బెహర, డబుల్స్‌లో కె.కిరణ్‌కుమార్‌–పి.శ్యామ్‌సుందరరావు జంట విజేతలుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement