ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..! | - | Sakshi
Sakshi News home page

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..!

Mar 1 2026 7:42 AM | Updated on Mar 1 2026 7:42 AM

ఫ్లాట

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..!

యువతను ప్రోత్సహించాలి పరిశ్రమలు తరలిపోతాయి

పలాస: జిల్లాలో అత్యంత వెనుకబడిన పలాస నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం తగ్గాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కోసం స్థలం కేటాయించడం జరిగింది. మండలంలోని రామకృష్ణాపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 167, 168, 179 తదితర చోట్ల సుమారు 60 ఎకరాల భూమి సేకరించారు. అక్కడ ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకున్నారు. స్థలం సేకరించిన సమయంలో అక్కడ ఒక స్క్వేర్‌ మీటర్‌ ధర రూ.1,426లుగా నిర్ణయించారు. ఆ తర్వాత కొన్ని కారణాలు వల్ల ప్రభుత్వం మారింది. ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తలకు రూ.1కే కావాల్సిన భూమి ఇస్తామని చెబుతున్న ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ మాత్రం అమాంతంగా మూడురెట్లు ధర పెంచేసింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఇండస్ట్రియల్‌ పార్కులో స్క్వేర్‌ మీటర్‌ ధర రూ.4,683లు చేసింది. దీంతో ఒక చిన్న పరిశ్రమదారుడు ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవాలంటే కేవలం ఒక ఫ్లాటును రూ.కోటి ఇచ్చి ముందు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు.

ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నత సాంకేతిక విద్యనభ్యసించిన నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల నుంచి సేకరించిన భూమి పరిశ్రమల కోసం ఫ్లాట్లు వేశాక ఈ ప్రాంత నిరుద్యోగులకు, చిన్న తరహా పరిశ్రమదారులకు ఉపయోగపడాలి. రూ.కోట్లు ఇచ్చి ఫ్లాట్లు కొనేవారు ఇక్కడ లేరు. ప్రభుత్వం ఆలోచించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడేవిధంగా ఉండాలి.

– ఎం.వినోద్‌, పీడీఎస్‌యూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస

ఆ ప్రాంతంలో జీడి మామిడి ఆధారిత చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎక్కువ శాతం అద్దె ఫ్యాక్టరీల్లో నడుస్తున్నాయి. కొన్ని చిన్న, చిన్న షెడ్లల్లో ఉన్నాయి. ఇటు వ్యాపారాలు చేసుకోలేక, అటు అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ ఫ్లాట్లు ఉపయోగపడాలి. బడా పారిశ్రామికవేత్తలకు రూ.1కే కావాల్సిన భూమి ఇచ్చినప్పుడు.. ఇక్కడ చిన్న వ్యాపారులకు ఈ విధంగా ధరలు పెంచడం సరికాదు. దీంతో ఇక్కడ పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉంది.

– పి.వి.సతీష్‌, వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, పలాస

ఈ పార్కు స్థలాన్ని అడ్డదారుల్లో పెద్దలకు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందని పలాస చిన్న తరహా పరిశ్రమదారుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం స్థలంలో రోడ్లు, మురికి కాలువలు, పార్కులు ఇతర నిర్మాణాలు పోగా.. పరిశ్రమల కోసం మొత్తం 78 ఫ్లాట్లును విభజించారు. ఒక్కో ఫ్లాటు స్థలం కనీసం 2 వేల చదరపు స్క్వేర్‌ మీటర్లు ఉంటుంది. ఒక స్వ్కేర్‌ మీటర్‌ ధర ప్రస్తుతం రూ.4,683లు అంటే సుమారు ఒక ఫ్లాటు కోసం దాదాపు రూ.కోటి ఉండాలి. ఈ ప్రాంతంలోని చిన్న, చిన్న వ్యాపారుల వద్ద అంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇండస్ట్రీయల్‌ పార్కులో ఈవిధంగా ధరలు పెంచడం వల్ల పెద్దలు, బడా వ్యాపారుల చేతికి ప్లాట్లు వెళ్లిపోతాయని స్థానిక యువకులు, చిన్న తరహా పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువలన గత ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఫ్లాట్లు కేటాయించి, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు.

రామకృష్ణాపురం ఇండస్ట్రియల్‌ పార్క్‌లో రేట్లు పెంచేసిన ప్రభుత్వం

గత ప్రభుత్వంలో స్క్వేర్‌ మీటర్‌ ధర రూ.1,426లు

ప్రస్తుతం స్క్వేర్‌ మీటర్‌ ధర రూ.4,683లు

నిప్పులు చెరుగుతున్న స్థానికులు

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..! 1
1/3

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..!

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..! 2
2/3

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..!

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..! 3
3/3

ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement